India Vs England 1st Test Day 3 :ఉప్పల్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆట ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యాన్ని సాధించిన భారత్, రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ను త్వరగానే పెవిలియన్‌కు పంపిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ, ఓలీ పోప్ మాత్రం తన అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. భారత స్పిన్నర్లు కట్టుదిట్టంగా బంతులేసినప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా భారీ స్కోర్ సాధించాడు. బ్యాటింగ్‌కు కష్టమైన పిచ్‌పై పోప్ (148*) అద్భుత శతకంతో రాణించాడు. దీంతో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో ఇవాళ ఆట ముగిసేసరికి ఆరు వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసింది.
ఇక క్రీజ్‌లో పోప్‌తో పాటు రెహాన్ (16*) ఉన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 190 పరుగులతో వెనకబడిన ఇంగ్లాండ్ జట్టు చివరికి 126 పరుగుల ఆధిక్యాన్ని సాధించి దూసుకెళ్లింది. ఓలీ కాకుండా, ఇంగ్లాండ్ జట్టులో బెన్ డకెట్ (47), బెన్ ఫోక్స్ (34), జాక్ క్రాలే (31) తమ ఆట తీరుతో ఫర్వాలేదనిపించారు. అయితే మిగతా బ్యాటర్లు విఫలం కావడం వల్ల ఇంగ్లాండ్ జట్టుకు కాస్త దెబ్బకొట్టింది. ఇక భారత బౌలర్లు బుమ్రా 2, అశ్విన్ 2, జడేజా, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 436 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
భారత్ తుది జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, శ్రీకర్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్,