Rohit Fun With Lady Fan : టీమ్ఇండియా ప్లేయర్లు మెల్బోర్న్ టెస్టుకు సన్నద్ధం అవుతున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ సహా, ఇతర ప్లేయర్లు మంగళవారం నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో యంగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌ను చూడాలంటూ ఓ లేడీ ఫ్యాన్ రోహిత్‌కు రిక్వెస్ట్ చేసింది. ఆమెకు రోహిత్ ఫన్నీగా రిప్లై ఇస్తూ నవ్వులు పూయించాడు.
ఎక్కడ నుంచి తీసుకురావాలి
రోహిత్ శర్మ తన ప్రాక్టీస్ సెషన్ కంప్లీట్ చేసుకొని తిరిగి వెళ్తుండగా అక్కడున్న ఓ లేడీ ఫ్యాన్ శుభ్‌మన్‌ను పిలవాలంటూ రిక్వెస్ట్ చేసింది. 'రోహిత్, రోహిత్ ప్లీజ్ శుభ్‌మన్ గిల్‌ను పిలవండి అంటూ అరిచింది. ఆమెకు రోహిత్ ఓకే అన్నట్లుగా చేయి చూపుతూ సైగ చేశాడు. అయినప్పటికీ ఆమె పదే పదే రిక్వెస్ట్ చేయడంతో రోహిత్ తనస్ట్రైల్లో రిప్లై ఇచ్చాడు. 'ప్లీజ్ శుభ్‌మన్‌ను పిలవండి' అని ఆమె అడగ్గా, 'అతడిని ఎక్కడ్నుంచి తీసుకురావాలి' అంటూ రోహిత్ ఫన్నీగా జవాబిచ్చాడు. దీంతో అక్కడున్నవాళ్లంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Courtesy: RevSportz pic.twitter.com/TtTAYfgqgy
— Nihari Korma (@NihariVsKorma) December 24, 2024
గిల్ గురించి రోహిత్
అంతకుముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గిల్ ఫామ్‌పై రోహిత్ మాట్లాడాడు. గిల్ నాణ్యమైన బ్యాటర్ అని కొనియాడాడు. 'అడిలైడ్ టెస్టులో గిల్ రెండు ఇన్నింగ్స్‌ల్లో మంచి ప్రదర్శనే చేశాడు. కానీ, వాటిని భారీ స్కోర్లుగా మల్చలేకపోయాడు. ప్రతి మ్యాచ్‌లో భారీ ఇన్నింగ్స్ ఆడడం అంత ఈజీ కాదు. గిల్ నాణ్యమైన బ్యాటర్. తను బ్యాటింగ్‌ను అర్థం చేసుకుంటాడు. టీమ్ఇండియాలోకి రాకముందు గిల్, దేశవాళీలో చాలా పరుగులు చేశాడు'అని రోహిత్ చెప్పాడు.
అయితే ప్రాక్టీస్ సెషన్స్‌కు అభిమానులను అనుమతించడంపై కెప్టెన్ రోహిత్, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రాక్టీస్ చేసేందుకు వచ్చిన ఫ్యాన్స్, ప్లేయర్లను ఫలానా షాట్ ఆడాలంటూ రిక్వెస్ట్ చేస్తున్నారంట. దీంతో ప్రాక్టీస్ చేస్తున్న సదరు ప్లేయర్ల ఏకాగ్రత దెబ్బతినే ప్రమాదం ఉందని మేనేజ్మెంట్ భావిస్తోంది. దీనిపై రోహిత్, విరాట్ కూడా అందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
గాయంపై స్పందించిన రోహిత్ - అతడికి ఇప్పుడెలా ఉందంటే?
కేఎల్ రాహుల్ దూకుడు - కోహ్లీ, రోహిత్, పంత్ కన్నా అతడే బెటర్