2025 Champions Trophy Schedule : క్రికెట్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 2025 ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మంగళవారం షెడ్యూల్ ప్రకటించింది. ఐసీసీ అధికారిక సోషల్ మీడియా అకౌంట్లో టోర్నీ పూర్తి షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఈ టోర్నమెంట్ 2025 ఫిబ్రవరి 19న ప్రారంభం కానుంది. మార్చి 09న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే సెమీ ఫైనల్, ఫైనల్‌కు రిజర్వ్ డే కూడా ఉంది. ఇక ఫైనల్‌కు భారత్ అర్హత సాధిస్తే, తుదిపోరు దుబాయ్ వేదికగా జరగనుంది. లేదంటే మ్యాచ్ లాహోర్‌లో ఉంటుంది.
టోర్నీలో పాల్గొనే ఎమినిది జట్లను రెండు గ్రూపులుగా విభజించి మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. గ్రూప్ ఏ లో భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు ఉండగా, గ్రూప్ బీ లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గానిస్థాన్, ఇంగ్లాండ్ ఉన్నాయి. కాగా, టోర్నీలో భారత్ మ్యాచ్‌లన్నీ దుబాయ్ వేదికగా జరగనున్నాయి. ఫిబ్రవరి 23న పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది.
Check out the full fixtures for the ICC Champions Trophy 2025. pic.twitter.com/oecuikydca
— ICC (@ICC) December 24, 2024
టోర్నీలో భారత్ పూర్తి మ్యాచ్‌లు
- ఫిబ్రవరి 20 : భారత్ - బంగ్లాదేశ్- దుబాయ్
- ఫిబ్రవరి 23 : భారత్- పాకిస్థాన్- దుబాయ్
- మార్చి 2 : న్యూజిలాండ్ - భారత్ - దుబాయ్
మ్యాచ్‌ల వేదికలు ఇవే
- లాహోర్
- కరాచీ
- రావల్పిండి
- దుబాయ్
ఆ టోర్నీలు కూడా ఇదే పద్ధతిలో
భారత్ కోరినట్లుగానే ఈ టోర్నీ హైబ్రిడ్ మోడల్‌లో జరగనుంది. అయితే 2024- 27 మధ్య ఐసీసీ ఈవెంట్లలో భారత్- పాకిస్థాన్ మ్యాచ్‌లు (భారత్, పాకిస్థాన్ రెండింటిలో ఏ దేశం ఆతిథ్యం ఇచ్చినా) తటస్థ వేదికలోనే నిర్వహించనున్నారు. 2025 మహిళల వరల్డ్‌కప్ (భారత్), 2026 T20 ప్రపంచ కప్ (భారత్, శ్రీలంక)లో జరగనున్నాయి. ఈ టోర్నీల కోసం పాకిస్థాన్ జట్టు భారత్‌లో పర్యటించదు. తటస్థ వేదికలో పాక్ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. 2028 టీ20 ప్రపంచ కప్ ఆతిథ్య హక్కులను పాక్ దక్కించుకుంది. ఈ టోర్నీకి కూడా హైబ్రిడ్ మోడల్ నిబంధన వర్తిస్తుంది.
కాగా, చివరిసారిగా 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ జరిగింది. ఆ ఎడిషన్‌లో పాకిస్థాన్ ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో భారత్‌ను ఓడించిన పాక్ విజేతగా నిలిచింది.
హైబ్రిడ్ మోడల్లోనే ఛాంపియన్స్ ట్రోఫీ - అధికారికంగా ప్రకటించిన ఐసీసీ
ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో దిగొచ్చిన పాక్ - హైబ్రిడ్ మోడల్‌కు ఐసీసీ ఆమోదం