తెలంగాణ

telangana

ETV Bharat / sports

కెప్టెన్​గా గిల్- నితీశ్ రెడ్డి, రియాన్​కు ఫస్ట్ ఛాన్స్- జింబాబ్వే ​టూర్​కు టీమ్ అనౌన్స్​ - India Tour Of Zimbabwe 2024

India Tour Of Zimbabwe 2024 Squad: జింబాబ్వే పర్యటనకు వెళ్లనున్న భారత జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించింది. ఈ జట్టులో తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డికి చోటు దక్కింది.

India Tour Of Zimbabwe
India Tour Of Zimbabwe (Source: Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Jun 24, 2024, 6:34 PM IST

Updated : Jun 24, 2024, 7:17 PM IST

India Tour Of Zimbabwe 2024 Squad:జింబాబ్వే పర్యటనకు వెళ్లనున్న భారత జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించింది. 15మందితో కూడిన జట్టును బీసీసీఐ వెల్లడించింది. ముందుగా ప్రచారం సాగినట్లుగానే యంగ్ బ్యాటర్ శుభ్​మన్ గిల్ ఈ పర్యటనకు కెప్టెన్​గా ఎంపికయ్యాడు. ఇక ఇటీవల ముగిసిన ఐపీఎల్​లో అదరగొట్టిన తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డికి తొలిసారి టీమ్ఇండియా పిలుపు అందింది. కాగా, జూలై 6న జింబాబ్వే పర్యటన ప్రారంభం కానుంది. టీమ్ఇండియా ఈ టూర్​లో 5 టీ20 మ్యాచ్​లు ఆడనుంది.

ఐపీఎల్‌ స్టార్స్​కు ఛాన్స్​:అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, నితీశ్​ రెడ్డి తమ అద్భుతమైన బ్యాటింగ్‌తో ఐపీఎల్‌ 17వ సీజన్‌లో ఆకట్టుకున్నారు. సన్​రైజర్స్​ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న నితీశ్ రెడ్డి 142.92 స్టైక్​ రేట్​తో 303 పరుగులతో రాణించాడు. అలాగే అభిషేక్ 484 పరుగులు చేశాడు. రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్‌ రియాన్‌ పరాగ్ ఏకంగా 573 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌తో వీళ్లు అంర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయనున్నారు. ఇక రెండో వికెట్ కీపర్​గా ధ్రువ్ జురెల్​కు జట్టులో చోటు లభించింది.

సీనియర్లకు రెస్ట్
కాగా, రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్​ పంత్​, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాకు మేనేజ్​మెంట్ రెస్ట్ ఇచ్చింది. ప్రస్తుత టీ20 వరల్డ్​కప్​ ముగిసిన తర్వాత వీళ్లంతా న్యూజిలాండ్​తో జరగనున్న టెస్టు సిరీస్​ కోసం సన్నద్ధం కావాల్సి ఉంటుంది.

పర్యటన షెడ్యూల్

తొలి టీ20 జూలై 6
రెండో టీ20 జూలై 7
మూడో టీ20 జూలై 10
నాలుగో టీ20 జూలై 13
ఐదో టీ20 జూలై 14
  • అన్ని మ్యాచ్​లకు హరారేలోని హరారే స్పోర్ట్స్​ క్లబ్ మైదానం వేదికకానుంది. అన్ని మ్యాచ్​లు భారతకాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం అవుతాయి.

భారత జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్ (వికెట్‌ కీపర్‌), ధృవ్ జురెల్ (వికెట్‌ కీపర్‌), నితీష్ రెడ్డి, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్‌, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముకేశ్​ కుమార్, తుషార్ దేశ్​పాండే.

గిల్​కు గోల్డెన్ ఛాన్స్- టీమ్ఇండియా కెప్టెన్​గా ప్రమోషన్!

రోహిత్ సేన చేతుల్లో ఆసీస్ భవిష్యత్! - T20 Worldcup 2024

Last Updated : Jun 24, 2024, 7:17 PM IST

ABOUT THE AUTHOR

...view details