India T20 World Cup: 2024 టీ20 వరల్డ్‌కప్ మరో 40 రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ బ్రాడ్‌కాస్టింగ్ ఛానెల్ స్టార్ స్పోర్ట్స్ తాజాగా టీమ్ఇండియా కోసం స్పెషల్ ప్రోమో వీడియో రిలీజ్ చేసింది. 'రోహిత్ సేన టీ20 వరల్డ్‌కప్‌నకు సిద్ధమవుతోంది. వాళ్ల యాక్షన్ చూడడానికి మీరు సిద్ధమా?' అని క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇక వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో భారత జాతీయ గేయం 'వందేమాతం' లిరిక్స్ ప్లే చేశారు. ఈ లిరిక్స్ వీడియోలో హైలైట్‌గా నిలిచాయి. మీరు వీడియో చూశారా?
ఇక టోర్నమెంట్ జూన్ 2న ప్రారంభం కానుంది. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీకి ఆమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. ఇప్పటికే ఐసీసీ అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. మ్యాచ్ జరిగే నగరాల్లో పలు స్టార్ హోటళ్లను ఆయా దేశాల ఆటగాళ్ల కోసం బుక్ చేశారంట. టోర్నీలో పాల్గొనే 20 దేశాల ప్లేయర్లు, జట్టు మేనేజ్మెంట్లు వీసా క్లియరెన్స్ పనులు పూర్తి చేసుకున్నాయి.
ఈ పొట్టికప్ కోసం అజిత్ ఆగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మరో వారం రోజుల్లో టీమ్ఇండియా జట్టును అనౌన్స్ చేయనుంది. ఈ జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్ ఎలాగో జట్టులో ఉండనున్నారు. ఇక మిగతా స్థానాల కోసం ఆయా ప్లేయర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఐపీఎల్లో రాణిస్తున్న యువ ఆటగాళ్లకు ఈ వరల్డ్‌కప్ టోర్నీలో ఛాన్స్ రానుంది.