Rohit Sharma 5th Test :బోర్డర్ గావస్కర్ ట్రోఫీ సిడ్నీ టెస్టులో టీమ్ఇండియా భారీ మార్పులతో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ టెస్టులో ఆడకపోవచ్చని క్రికెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుత ఫామ్ దృష్యా ఆఖరి టెస్టులో ఆడకూడదని రోహిత్ నిర్ణయించుకున్నట్లు కథనాలు వస్తున్నాయి. గురువారం జరిగిన ప్రెస్‌మీట్‌కు రోహిత్ లేకుండానే గంభీర్ హాజరవ్వడం ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తోంది. దీంతో రోహిత్ స్థానంలో మళ్లీ జస్ప్రీత్ బుమ్రాకే సారథ్య బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం.
రోహిత్ స్థానంలో అతడే
రోహిత్‌కు విశ్రాంతినిచ్చి అతడి స్థానంలో యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌కు ఛాన్స్ ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది. దీంతో యశస్వీ జైస్వాల్‌తో కలిసి కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడు. గిల్ వన్డౌల్లో వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే ఈ సిరీస్‌లో అంచనాలు అందుకోవడంలో విఫలమవుతున్న రిషభ్ పంత్‌ను కూడా పక్కన పెట్టాలని మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. అతడికి స్థానంలో ధ్రువ్ జురెల్‌ను జట్టులోకి తీసుకొనేందుకు మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం.
రేస్‌లో విరాట్ కూడా
రోహిత్ ఐదో టెస్టు నుంచి తప్పుకుంటే బుమ్రాకే మళ్లీ కెప్టెన్సీ అప్పగిస్తారని ప్రచారం సాగుతోంది. అయితే కెప్టెన్సీ బాధ్యతలు అందుకునేందుకు విరాట్ కూడా ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. మెల్బోర్న్ టెస్టులో గ్రౌండ్లో విరాట్ చురుగ్గా స్పందించడం, ఫిట్నెస్ కారణంగా మరో రెండేళ్ల పాటు టెస్టుల్లో కొనసాగే అవకాశం ఉండడం వల్ల సారథ్య బాధ్యతలు అతడికే దక్కుతాయని కూడా కథనాలు వస్తున్నాయి.