2024 Asian Champions Trophy:2024 ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ జట్టు హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. ఈ టోర్నీలో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు నెగ్గిన టీమ్ఇండియా, బుధవారం మలేసియాను ఢీకొట్టింది. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చలాయించిన భారత్ 8-1 తేడాతో భారీ విక్టరీ కొట్టింది. ఈ విజయంతో భారత్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.
రాజ్ హ్యాట్రిక్
రాజ్‌కుమార్ పాల్ హ్యాట్రిక్ గోల్స్ చేశాడు. అతడు తొలి మూడు క్వార్టర్స్‌లో హ్యాట్రిక్‌తో అదరగొట్టాడు. రాజ్‌కుమార్ 3వ నిమిషం, 25వ నిమిషం, 33వ నిమిషం బంతిని నెట్స్‌లోకి పంపాడు. అత్యుత్తమ ఆట తీరుతో ఈ విజయంలో రాజ్‌కుమార్ కీలక పాత్ర పోషించాడు. ఇక పెనాల్టీ కార్నర్ ద్వారా అరజీత్ సింగ్ హుందాల్ రెండు (6వ నిమిషం, 39వ నిమిషం) గోల్స్‌తో ఆకట్టుకున్నాడు. జుగ్‌రాజ్ సింద్ (7వ నిమిషం), హర్మన్‌ప్రీత్ సింగ్ (22వ నిమిషం), ఉత్తమ్ సింగ్ (40వ నిమిషం) ఒక్కో గోల్స్‌తో రాణించారు. ఇక మలేసియా మ్యాచ్ మొత్తంలో కేవలం ఒకే ఒక్క గోల్ చేయగలిగింది.
మరోవైపు గతేడాది రన్నర్స్ మలేసియా ఇప్పటిదాకా ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు మ్యాచ్‌లు ఓడిగా, మరోటి డ్రా చేసుకుంది. దీంతో మలేసియా సెమీఫైనల్ సంక్లిష్టంగా మారాయి. మలేసియా చివరి రెండు మ్యాచ్‌ల్లో జపాన్, కొరియాను ఢీకొట్టనుంది.
జట్టు | ఆడిన మ్యాచ్‌లు | గెలుపు | ఓటమి | డ్రా | పాయింట్లు |
భారత్ | 3 | 3 | 0 | 0 | 9 |
పాకిస్థాన్ | 3 | 1 | 2 | 2 | 5 |
చైనా | 2 | 1 | 1 | 0 | 3 |
కొరియా | 2 | 0 | 0 | 2 | 2 |
జపాన్ | 3 | 0 | 2 | 1 | 1 |
మలేసియా | 3 | 0 | 2 | 1 | 1 |