ETV Bharat / bharat

రాహుల్ కన్నా మోదీ ఎందులో ఎక్కువ? ఎన్నికల ప్రచారంలో లెవల్ ప్లే ఒకేలా ఉండాలిగా: కాంగ్రెస్​ - LEVEL PLAYING FIELD IN CAMPAIGNING

రాహుల్ గాంధీ హెలికాప్టర్​కు క్లియరెన్స్ ఇవ్వలేదు - మోదీ విమానం సాంకేతిక సమస్యతో ఎగరలేదు - ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో ఏం జరిగిందంటే?

MODI vs Rahul campaigning
MODI vs Rahul campaigning (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 15, 2024, 7:09 PM IST

Level Playing Field In Campaigning : ఝార్ఖండ్​ ఎన్నికల ప్రచారం కోసం వెళ్తున్న కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీ హెలికాప్టర్​కు ఎయిర్​ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) నుంచి క్లియరెన్స్​ రాకపోవడంపై ఆ పార్టీ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీకి ప్రథమ ప్రాధాన్యం ఇచ్చి, రాహుల్ గాంధీకి ఇవ్వకపోవడంపై ఎలక్షన్ కమిషన్​కు ఫిర్యాదు చేసింది. అసలు ఎన్నికల ప్రచారంలో లెవల్ ప్లే ఉండాలని, ఒకరి కంటే మరొకరిని తక్కువ లేదా ఎక్కువ చేసి చూడకూడదని పేర్కొంది. అందువల్ల ఈ విషయంలో ఈసీ జోక్యం చేసుకుని లెవల్ ప్లే సరిగ్గా ఉండేలా చూడాలని కోరింది.

"ఎన్నికల ప్రచారంలో అందరికీ సమానావకాశాలు ఉండాలి. ప్రధానమంత్రి ప్రచారానికి అన్నింటి కంటే అధిక ప్రాధాన్యత ఉండదు. కానీ ఈ రోజు రాహుల్​ గాంధీని తక్కువ చేసే ప్రయత్నం జరిగింది. అందుకే ఆయన ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారం ఆలస్యం అయ్యింది."
- జైరాం రమేశ్​, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ

'ఝార్ఖండ్​ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించడానికి, ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడానికి రాహుల్ గాంధీ అన్ని అనుమతులు పొందారు. ముందే నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం, మహాగామా అసెంబ్లీ నియోజవర్గంలో ప్రసంగించిన తరువాత రాహుల్​ గాంధీ మధ్యాహ్నం 1.15 గంటలకు ఇతర ప్రాంతాల ప్రచారానికి వెళ్లాల్సి ఉంది. కానీ ఆయన హెలీకాప్టర్​కు ఏటీసీ క్లియరెన్స్ ఇవ్వలేదు. సమీపంలో ఇతర నాయకుల (ప్రధాని మోదీ) ప్రోటోకాల్ ఉన్న కారణంగా, నో-ఫ్లై జోన్​ పరిమితి విధించారు. దీని వల్ల రాహుల్ గాంధీ కార్యక్రమాలు ఆలస్యం కావడం లేదా రద్దు కావడం జరిగింది. ఇది ఏమాత్రం సమంజసంగా లేదు. ఒకవేళ ఇలాంటి పరిస్థితిని అనుమతిస్తే, అధికారంలో ఉన్న వాళ్లు ఈ ప్రోటోకాల్​ను తమకు అనుకూలంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ప్రతిపక్ష నాయకుల ఎన్నికల ప్రచారానికి అడ్డంకి ఏర్పడుతుంది. కనుక ఈ విషయంలో ఈసీ కలుగజేసుకుని లెవల్ ప్లే సరిగ్గా ఉండేలా చూడాలి' అని జైరాం రమేశ్ ఎలక్షన్​ కమిషన్​కు అందజేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

మోదీ విమానంలో సాంకేతిక సమస్య
ప్రధాని నరేంద్రమోదీ ప్రయాణించాల్సిన ఎయిర్‌క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య ఏర్పడింది. ఝార్ఖండ్‌లో ఎన్నికల ప్రచారం ముగించుకుని తిరిగి బయల్దేరే సమయంలో ఈ ఘటన జరిగింది. దీనితో ఆయన 2 గంటల తరువాత మరో విమానంలో దిల్లీ వెళ్లారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ ఝార్ఖండ్‌లోని రెండు ప్రాంతాల్లో జరిగిన సభల్లో పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.