ETV Bharat / offbeat

యమ్మీ యమ్మీ అనిపించే డోమినోస్ స్టైల్ "వెజ్ సుప్రీం పిజ్జా" - ఇంట్లోనే కుక్కర్​లో సింపుల్​గా చేసుకోండిలా! - VEG SUPREME PIZZA RECIPE

పిజ్జా తినాలంటే బేకరీకి వెళ్లాల్సిన పనిలేదు - ఇంట్లోనే డోమినోస్​ స్టైల్​లో ప్రిపేర్ చేసేయండిలా!

How to Make Veg Supreme Pizza
Veg Supreme Pizza (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 15, 2024, 1:44 PM IST

How to Make Veg Supreme Pizza At Home : పిజ్జా.. పిల్లల నుంచీ పెద్దవాళ్లవరకూ ఇష్టపడే ఆహార పదార్థాల్లో ఒకటి. ఎప్పుడైనా కుటుంబమంతా కలిసి సరదాగా పిజ్జా తినాలనుకున్నప్పుడు.. ఆర్డరిస్తే వచ్చే పిజ్జాలో తలా ఒక ముక్కా ఎవరికీ సరిపోదు. కాబట్టి, మీరు ఇకపై పిజ్జా తినాలనుకుంటే బేకరీ లేదా ఆన్​లైన్​లో ఆర్డర్ చేయాల్సిన పనిలేదు. మీరే ఇంట్లో కుక్కర్ లేదా పాన్ మీద ఈజీగా ఇలా డోమినోస్ స్టైల్​లో "వెజ్ పిజ్జా"ను ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్​ కూడా అద్దిరిపోతుంది! మరి, ఇంకెందుకు ఆలస్యం అందుకు కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

పిజ్జా బేస్ తయారీ కోసం :

ఈస్ట్ కోసం :

  • డ్రై ఈస్ట్ - 4 గ్రాములు
  • చక్కెర - 2 టీస్పూన్లు
  • మైదా - అరటీస్పూన్

పిండి కోసం :

  • మైదా - పావు కప్పు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • మిల్క్ పౌడర్ - 2 టీస్పూన్లు
  • నూనె - 1 టేబుల్​స్పూన్
  • బటర్ - 1 టేబుల్​స్పూన్
  • కార్న్ మీల్(మొక్కజొన్నల పిండి) - అరకప్పు

టాపింగ్ కోసం :

  • మోజరెల్లా చీజ్ - ఒక కప్పు
  • ప్రాసెస్డ్ చీజ్ తరుగు - ముప్పావు కప్పు
  • ఆనియన్ పెటల్స్ - కొన్ని
  • క్యాప్సికం ముక్కలు - కొన్ని
  • పన్నీర్ ముక్కలు - 50 నుంచి 75 గ్రాములు
  • ఆయిల్/నెయ్యి - కొద్దిగా

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా పిజ్జా బేస్ ప్రిపేర్ చేసుకోవాలి. అందులో భాగంగా మొదట ఈస్ట్ రెడీ చోసుకోవాలి.
  • దానికోసం ఒక చిన్న బౌల్​లో ఇన్​స్టంట్ డ్రై ఈస్ట్, చక్కెర, మైదా తీసుకొని అరకప్పు గోరువెచ్చని వాటర్ పోసుకొని కలిపి ఈస్ట్​ని చక్కగా పొంగనివ్వాలి.
  • ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మైదా, ఉప్పు, మిల్క్ పౌడర్, నూనె, బటర్ వేసుకొని పిండి బ్రెడ్ పొడిలా అయ్యేంత వరకు కలుపుకోవాలి.
  • ఆ తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొంగిన ఈస్ట్ నీళ్లను అందులో పోసుకొని సాఫ్ట్​గా కలుపుకోవాలి. అయితే, పిండి అనేది మరీ గట్టిగా, చపాతీ పిండి మాదిరిగా ఉండకూడదు. కాస్త పల్చగా, సాఫ్ట్​గా ఉండేటట్లు కలుపుకోవాలి.
  • ఆవిధంగా పిండిని ప్రిపేర్ చేసున్నాక.. దాన్ని పెద్ద చపాతీ పీట లేదా శుభ్రమైన కిచెన్ బండ మీద ఆ పిండి ముద్దను వేసుకొని 10 నుంచి 12 నిమిషాల పాటు బాగా చేతితో పిండిని విడదీస్తూ మిక్స్ చేసుకోవాలి. అంటే.. రాక్ అండ్ రోల్ పద్ధతిలో పిండిని బాగా సాగదీస్తూ వత్తుతూ కలుపుకోవాలి.
  • మీరు పర్ఫెక్ట్​గా పిండిని ప్రిపేర్ చేసుకున్నారని తెలుసుకోవడానికి అందులో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని కాస్త స్ప్రెడ్ చేస్తే చిరగని పల్చని తెరలా స్ప్రెడ్ అవ్వాలి. అలా అయితే అప్పుడు రెసిపీలోకి కావాల్సిన పిండి రెడీ అయిందని అర్థం చేసుకోవాలి.
  • ఆ తర్వాత అడుగు నుంచి రెండు చేతులతో పిండిని వత్తుకుంటూ తిప్పుతూ ముద్దలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు ఒక బౌల్​లో కాస్త ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని అందులో మీరు రెడీ చేసుకున్న పిండి ముద్దను ఉంచి ఆపై కొద్దిగా నూనెను అప్లై చేసి బౌల్​లోకి గాలి చొరబడకుండా క్లాత్ లేదా కవర్​తో కప్పి కనీసం 45 నిమిషాల పాటు అలా వదిలేయాలి. పిండి రెట్టింపు అయిందనుకున్నాక క్లాత్ తీసి పిండి లోపల ఏర్పడిన ఎయిర్​ని తీసేయాలి.
  • తర్వాత ఆ పిండి ముద్దను రెండు భాగాలుగా విభజించుకొని.. ఆపై ఒక్కో పిండి ముద్దను పై నుంచి లోపలికి లాగుకుంటూ స్మూత్ బాల్ మాదిరిగా చేసుకోవాలి.
  • అనంతరం చపాతీ పీట లేదా శుభ్రమైన బండ మీద కార్న్ మీల్ చల్లుకొని పిండి ముద్దను ఉంచి రెండు వైపులా పొడి పిండిని చల్లుకుంటూ చపాతీ రోలర్ సహాయంతో అరఇంచు మందం ఉండేలా రోల్ చేసుకోవాలి.
  • తర్వాత కుక్కర్​లో పిజ్జా ప్రిపేర్ చేసుకునే వారు దాని సైజ్​లో ఉండేలా ప్లేట్​ బోర్లించి పిజ్జా రోలర్​తో కట్ చేసుకోవాలి.
  • ఇప్పుడు కుక్కర్​ లేదా పాన్​లో సరిపోయే విధంగా ఉండే ప్లేట్ తీసుకొని దానిపై బటర్ లేదా ఆయిల్ అప్లై చేసుకొని కాస్త మొక్కజొన్న పిండి చల్లుకొని రోల్ చేసుకున్న పిజ్జా షీట్​ను ఉంచి అంచుల వెంబడి కాస్త వాటర్ పూసి అరఇంచు మందం లోపలికి ఫోల్డ్ చేసుకుని గట్టిగా సీల్ చేసుకోవాలి.
  • ఇలా సీల్ చేసుకున్నాక ఫోర్క్​ స్పూన్​తో పిజ్జా షీట్ మొత్తం పిక్ చేసుకోవాలి. ఆ తర్వాత దానిపై క్లాత్ కప్పి పావు గంటపాటు అలా వదిలేయాలి.
  • పావుగంట తర్వాత ఆ పిజ్జా బేస్ డబుల్ అయిపోతుంది. అనంతరం ఆ పిజ్జా బేస్ మీద పిజ్జా సాస్​ను అప్లై చేసుకోవాలి. ఆపై మోజరెల్లా చీజ్, ప్రాసెస్డ్ చీజ్​ను సమాంతరంగా పరచుకోవాలి. అలాగే దానిపై ఆనియన్, క్యాప్సికం పెటల్స్ సర్దుకున్నాక అక్కడక్కడ కొన్ని పన్నీర్ ముక్కలతో టాపింగ్ చేసుకొని పిజ్జా బేస్ అంచులను కాస్త ఆయిల్​తో బ్రష్ చేసుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై హీట్ బయటకు పోని పాన్ లేదా కుక్కర్ ఉంచి దానిపై మూతపెట్టి హై ఫ్లేమ్ మీద 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి.
  • 10 నిమిషాల తర్వాత మూత తీసి లోపల ఏదైనా స్టాండ్ ఉంచి పిజ్జా ఉంచిన ఫ్లేట్ పెట్టి అంచులను మరోసారి ఆయిల్​తో బ్రష్ చేసుకొని లో ఫ్లేమ్ మీద 25 నిమిషాలు, మీడియం ఫ్లేమ్ మీద 15 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. లేదా చీజ్ మెల్ట్ అయ్యేంత వరకు బేక్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత మూత తీసి చూస్తే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే "డోమినోస్ స్టైల్ వెజ్ పిజ్జా" రెడీ!

ఇవీ చదవండి :

బేకరీ స్టైల్​ "దిల్​పసంద్" - ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోండిలా! - టేస్ట్​ సూపర్​గా ఉంటుంది!

బేకరీలో దొరికే ఎగ్ పఫ్స్ ఇంట్లోనే - అది కూడా ఓవెన్​ లేకుండానే! - ఇలా ప్రిపేర్ చేసుకోండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.