ETV Bharat / spiritual

మహాశివరాత్రి నాడు శ్రీశైలంలో ప్రత్యేక పూజలు- ఒక్కసారి దర్శిస్తే చాలు జన్మ ధన్యం! - MAHASHIVRATRI IN SRISAILAM TEMPLE

మహాశివరాత్రి ప్రత్యేకం శ్రీశైలం క్షేత్ర దర్శనం- ఒక్కసారి పూజిస్తే మోక్షం ఖాయం!

Srisailam Temple
Srisailam Temple (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 25, 2025, 7:06 PM IST

Mahashivratri In Srisailam Temple : భువిలో వెలసిన కైలాసం శ్రీశైలం. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా భాసిల్లుతున్న శ్రీశైలం భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి క్షేత్రంగా పేరొందింది. మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం క్షేత్ర విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

శ్రీశైలం విశిష్టత
శ్రీశైలం క్షేత్రాన్ని ఒక్కసారి దర్శిస్తే గంగా నదిలో రెండు వేల సార్లు మునిగిన పుణ్యం, కాశీ క్షేత్రంలో లక్షలాది సంవత్సరాలు నివసిస్తే లభించేంత పుణ్యం లభిస్తుందని శాస్త్రవచనం.

శ్రీశైలం ఎక్కడుంది?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలుకు 180 కి.మీల దూరంలో నల్లమల అడవుల్లో పచ్చని పర్వతాలు, లోయలు, దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ పుణ్యక్షేత్రం ఉంది.

ఆలయ స్థలపురాణం
పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రపంచాన్ని పరిపాలించేవాడు. అతను చాలా కాలం పాటు గాయత్రీ మత్రం జపిస్తూ బ్రహ్మ కోసం తపస్సు చేసి ద్విపాదాలచే, చతుష్పాదాలచే మరణం లేకుండా వరం పొందాడు. వరం ప్రభావంతో భయపడిన దేవతలు ఆదిశక్తిని ప్రార్థించారు. అమ్మవారు ప్రత్యక్షమయి అరుణాసురుడు తన భక్తుడని గాయత్రీ మంత్రం జపిస్తున్నంత వరకు అతనిని ఎవరూ ఏమీ చేయలేరని చెబుతుంది. తర్వాత దేవతలు ఒక పథకం ప్రకారం తమ గురువు అయిన బృహస్పతిని అరుణాసురుని దగ్గరికి పంపిస్తారు. అరుణాసురుడు దేవ గురువు బృహస్పతి రాక గురించి ఆశ్చర్యం వ్యక్త పరుచగా, బృహస్పతి అందుకు నమాధానంగా ఇద్దరం ఒకే అమ్మవారిని గాయత్రీ మంత్రంతో పూజ చేస్తున్నామని, కాబట్టి నా రాకలో వింత ఏమి లేదని చెబుతాడు. అందుకు అరుణాసురుడు దేవతలు పూజ చేసే అమ్మవారిని నేను ఎందుకు పూజ చేయాలని అహంకరించి గాయత్రి మంత్రం జపాన్ని మానేస్తాడు. దానికి కోపించిన ఆదిశక్తి భ్రమర రూపం ధరించి అసంఖ్యాకంగా భ్రమరాలని సృష్టిస్తుంది. ఆ భ్రమరాలు అరుణాసురుడిని, అతని సైన్యాన్ని సంహరిస్తాయి.

మల్లిఖార్జునుడనే నామధేయం ఇలా వచ్చింది!
కృష్ణానది తీరంలో మల్లికాపుర మహారాజగు చంద్రకేతుడు సంతానం కోసం పరితపిస్తుండగా, ఆ రాజుకు లేకలేక ఓ అమ్మాయి జన్మించింది. ఆమెకు చంద్రమతి అని నామకరణం చేశారు. ఆమె పుట్టిన తర్వాత రాజపురోహితులు చంద్రకేతుని జైత్రయాత్ర ముహూర్తం పెట్టారు. చంద్రకేతుడు జైత్రయాత్రను మొదలుపెట్టి రాజ్య విస్తరణ కాంక్షతో కొన్నేళ్లపాటు అలా కొనసాగిస్తూనే ఉన్నాడు. అలా కొన్నేళ్లు గడిచిన తర్వాత చంద్రకేతుడు జైత్రయాత్ర ముగించి, తిరిగి మల్లికాపురానికి చేరుకున్నాడు.

కుమార్తెను కామించిన చంద్రకేతుడు
రాజ్యానికి తిరిగి వచ్చిన చంద్రకేతు తన అంతఃపురంలో తిరుగుతున్న అందమైన కన్యను చూసి మోహించాడు. ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలని ఆమె వెంటపడ్డాడు. అది చూసిన అతని భార్య ఆమె మరెవరో కాదు, మీ కూతురు చంద్రమతి అని చెప్పినా చంద్రకేతుడు పట్టించుకోలేదు. చంద్రమతి చేతులు జోడించి 'నేను మీ కుమార్తెను. వదిలిపెట్టండి' అని వేడుకున్నా, చంద్రకేతుడు కామకాంక్షతో ఆమెను లోబరుచుకోడానికి ప్రయత్నించాడు.

శివుని ప్రార్థించిన చంద్రమతి
దీంతో చంద్రమతి బ్రహ్మగిరిని వదిలి కృష్ణానది దాటి కొండల్లోకి పరుగు తీసింది. అక్కడ ఓ గుహలో తలదాచుకుంది. దీంతో ఆమె కోసం చంద్రకేతుడు ఆ గుహ బయటే మాటువేశాడు. శివ భక్తురాలైన చంద్రమతి మరోదారిలేక తండ్రి నుంచి తనను కాపాడాలని శివుడిని మల్లెపూలతో పూజించింది. ఆమె మొరాలకించిన శివుడు చంద్రకేతుడిని ఆకుపచ్చ శిలగా మార్చేశాడు. ఆ శిల దొర్లుకుంటూ పాతాళగంగలో పడింది. అందువల్లే అక్కడి నీరు పచ్చగా ఉంటుందని భక్తులు నమ్ముతారు. అనంతరం శివుడు మల్లికాపురమును నిర్మూలిస్తాడు. అప్పటి నుంచి శివునికి మల్లిఖార్జునుడనే నామధేయం ఏర్పడిందని స్థలపురాణం ద్వారా మనకు తెలుస్తోంది.

ఆలయ విశేషాలు
శ్రీమల్లికార్జునుని దేవాలయంలో మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగంగా పూజలందుకుంటున్నాడు. నాలుగు మండపములతో అపూర్వమైన శిల్ప సంపదతో అలరారే అందమైన దేవాలయము శ్రీశైలం.

శక్తిపీఠం కూడా
శ్రీశైలం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా భాసిల్లుతోంది. ఇక్కడ వెలసిన అమ్మవారు భ్రమరాంబికా దేవి. ఈ దేవాలయంలో గర్భాలయ వెనుక భాగమున గోడకు చెవి ఆన్చి వింటే ఝుమ్మనే భ్రమరనాదం వినిపించడం ఇక్కడి ప్రత్యేకత.

సాక్ష్యమిచ్చే సాక్షి గణపతి
శ్రీశైలానికి 3 కి.మీల దూరంలో ఉన్న సాక్షి గణపతి ఆలయం కూడా తప్పకుండా సందర్శించాల్సిన ప్రాంతం. ఇక్కడ గణపతిని దర్శిస్తే స్వామి శివునికి ఫలానా భక్తుడు శ్రీశైలానికి వచ్చాడని సాక్ష్యం చేబుతాడట! లేకుంటే మనం శ్రీశైలం వెళ్లిన దర్శన ఫలం దక్కదని విశ్వాసం.

మనోహర గుండం
శ్రీశైలంలో తప్పకుండా చూడవలసిన వాటిలో ఇది ఒకటి. దీనిలో గొప్పతనం ఏమిటంటే చాలా స్వచ్ఛమైన నీరు ఈ గుండములో ఉంటుంది.

పంచ పాండవులు దేవాలయాలు
పాండవులు మల్లికార్జునుని దర్శించుకొని వారి పేరున 5 దేవాలయాలను ప్రధాన దేవాలయ వెనుక భాగమున నిర్మించి శివలింగములను ప్రతిష్ఠించిరి. శ్రీశైలం వెళ్లిన వారు ఈ పంచపాండవులు ఆలయాలను కూడా తప్పకుండ దర్శించుకోవాలి.

వృద్ద మల్లికార్జున లింగం
శ్రీశైలం ఆలయంలోని వృద్ద మల్లికార్జున లింగం- ముడతలు పడిన ముఖంలా ఉన్న శివ లింగం. దీనిని కూడా తప్పకుండ దర్శించుకోవాలి.

పాతాళ గంగ
పాతాళ గంగ వద్ద నీరు నీలంగా కాక పచ్చగా ఉంటుంది. నీటి కింద బండలపై నాచు నిలిచి సూర్య కిరణాల వెలుగు వలన పచ్చగా కానవస్తుంది. అయితే అందరూ నీటి కింద గల దీనిని పచ్చల బండ అని వ్యవహరిస్తారు.

జన్మరాహిత్యం శ్రీశైల శిఖర దర్శనం
శ్రీశైలం మొత్తంలో ప్రత్యేకమైనది, ఈ శ్రీశైల శిఖరం. శ్రీశైలములో శిఖరదర్శనము చేసుకొంటే పునర్జన్మ ఉండదు అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఈ ప్రాంతం నుంచి దూరంగా ఉన్న ఆలయ శిఖరాన్ని దర్శనం చేయగలిగితే పునర్జన్మ ఉండదని, జన్మరాహిత్యం కలుగుతుందని భక్తుల నమ్మకం.

ఫాలధార, పంచధారలు
సాక్షిగణపతి గుడికి మధ్యగా హటకేశ్వరానికి సమీపాన అందమైన లోయలో ప్రశాంత ప్రదేశంలో జగద్గురు శంకరాచార్య తపమాచరించిన ప్రదేశము ఉంది. ఇక్కడి శిలపై శంకరుని పాదముద్రలు ఉన్నాయి. ఈ కొండ పగుళ్ల నుంచి పంచధారలతో ఉరికివచ్చే జలాలు చల్లగా ఏ కాలంలోనైనా ఒకే మాదిరిగా ప్రవహిస్తూ ఒక్కొక్క ధార ఒక్కొక్క రుచితో ఉండడం ఇక్కడి ప్రత్యేకత. ఒక ధార నుంచి నీరు త్రాగి, ఇంకో ధార నుంచి నీరు త్రాగితే రుచిలో మార్పు తెలుస్తుంది.

హటకేశ్వరం
శ్రీశైలమల్లికార్జున దేవస్థానమునకు మూడు కిలోమీటర్ల దూరములో కల మరొక పుణ్యక్షేత్రం హటకేశ్వరం. ఇక్కడ పరమశివుడు అటిక అంటే ఉట్టి, కుండ పెంకులో వెలియడంతో ఈ ఆలయంలోని ఈశ్వరుని అటికేశ్వరుడు అనేవారు. రానురాను అదే మెల్లగా హటికేశ్వరస్వామిగా మారిపోయింది.

ఇష్టకామేశ్వరి క్షేత్రం
నల్లమల అడవుల్లో ఉన్న ఇష్ట కామేశ్వరి ఆలయం గురించి అతి కొద్దిమందికి మాత్రమే తెలుసు. మహిమాన్వితమైన ఇష్టకామేశ్వరి దేవి పేరుతో శ్రీశైల క్షేత్రంలో తప్ప దేశంలో మరెక్కడా ఇలాంటి ఆలయం కనిపించదు. ఎంతో అదృష్టం ఉంటే తప్ప అమ్మవారి దర్శనం చేసుకోలేమని భక్తుల విశ్వాసం.

పూజోత్సవాలు
శ్రీశైలంలో ప్రతి నిత్యం లక్షలాది మంది భక్తులతో సందడిగా ఉంటుంది. ముఖ్యంగా కార్తికమాసం, మహాశివరాత్రి సమయంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. శరన్నవరాత్రి ఉత్సవాలు కూడా ఎంతో వైభవంగా జరుగుతాయి. మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ప్రతిరోజూ త్రికాల పూజలు, అభిషేకాలు, స్పర్శ దర్శనం, ధూళి దర్శనం వంటి పూజలతో శ్రీశైలం నిత్యకల్యాణం పచ్చతోరణం అన్నట్లుగా ఉంటుంది. అంతేకాదు తిరుమల ఆలయంలో మాదిరిగానే ఇక్కడ కూడా ప్రతిరోజూ కల్యాణం జరుగుతుంది. అయితే శ్రీశైలంలో శివపార్వతుల కల్యాణం సాయంత్రం జరగడం విశేషం. కేవలం దర్శించినంత మాత్రాన్నే మోక్షాన్ని ప్రసాదించే శ్రీశైల క్షేత్రాన్ని ఈ శివరాత్రి సందర్భంగా మనసులో స్మరించిన చాలు దర్శనఫలం లభిస్తుందని విశ్వాసం. ఓం నమః శివాయ!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.