ETV Bharat / sports

'బుమ్రా వికెట్ తీస్తా, 100 డాలర్లు బెట్': పంత్ - BCCI FUNNY VIDEO

ప్రాక్టీస్ సెషన్​లో బుమ్రా, పంత్ ఫన్నీ చిట్​చాట్- వీడియో షేర్ చేసిన BCCI

BCCI Video
BCCI Video (Source: Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Nov 15, 2024, 3:53 PM IST

BCCI Funny Video : 2024 బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి భారత్​ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకున్న టీమ్ఇండియా ప్లేయర్లంతా నెట్స్​లో ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే ప్రాక్టీస్‌ సందర్భంగా స్టార్ పేసర్ బుమ్రా, యంగ్ బ్యాటర్ రిషభ్ పంత్ మధ్య ఓ ఫన్నీ సంఘటన జరిగింది. వాళ్లిద్దరి మధ్య సంభాషణ క్రికెట్ ఫ్యాన్స్​ను ఆకట్టుకుంటుంది. దీన్ని బీసీసీఐ తన అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్​లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్​గా మారింది.

ప్రాక్టీస్​లో బుమ్రాకు పంత్ బౌలింగ్ చేశాడు. ఈ క్రమంలోనే 'బుమ్రా నిన్ను ఔట్ చేస్తా' అని పంత్ అన్నాడు. బుమ్రాను ఔట్ చేస్తానని బౌలింగ్ కోచ్​ మోర్నీ మోర్కెల్​తో వంద డాలర్లు బెట్ అంటూ సరదాగా నవ్వులు పూయించాడు.

  • పంత్‌: బుమ్రా నిన్ను ఔట్‌ చేస్తా. మోర్నీ మోర్కెల్‌ నువ్వే చెప్పాలి. బుమ్రా ఔట్‌ అయ్యాడా? లేదా? అనేది చెప్పు.
  • మోర్నీ: నీ బౌలింగ్‌ యాక్షన్ చూస్తుంటే. హషీమ్ ఆమ్లా గుర్తుకొస్తున్నాడు.
  • పంత్‌: ఇప్పుడు వేసే ఈ బంతికి బుమ్రాను ఔట్ చేస్తా. వంద డాలర్లు బెట్.
  • పంత్ వేసిన ఆ తర్వాత బంతికి బుమ్రా షాట్‌ కొట్టాడు. ఆ నెట్స్‌ను చూపిస్తూ బుమ్రా ఔట్‌ అంటూ పంత్ నవ్వులు చిందించాడు. దానికి బుమ్రా సరదాగా స్పందించాడు.
  • బుమ్రా: పంత్ బౌలింగ్‌ యాక్షన్ ఇల్లీగల్. అది ఔట్ కాదు. నాకు తెలిసి అది బౌండరీ లేదా టూడీ (2)​ అనుకుంటా. ఫుల్‌ షాట్‌ చక్కగా కనెక్ట్‌ చేశా. సర్కిల్‌లో ఏడుగురు ఫీల్డర్లను అనుమతించకూడదు. అసలు బౌలింగ్‌ చేయడానికే వీల్లేదు.
  • పంత్ : నేను బుమ్రాను మ్యాచ్​లో ఔట్ చేయలేకపోవచ్చు. కానీ, నెట్స్​లో బౌలింగ్ చేసిన ప్రతీసారి ఔట్ చేస్తా.

బోర్డర్ గావస్కర్ ట్రోఫీకి భారత్ జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, సర్ఫరాజ్‌ ఖాన్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, సిరాజ్, ఆకాశ్‌ దీప్, ప్రసిధ్‌ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.. రిజర్వ్: ముకేశ్‌ కుమార్, నవ్‌దీప్‌ సైని, ఖలీల్ అహ్మద్

బోర్డర్ గావస్కర్ ట్రోఫీ - కోహ్లీ, రోహిత్ ఫామ్‌పై మైండ్‌ గేమ్‌ స్టార్ట్

వరల్డ్​కప్ నెగ్గడంలో బిగ్ స్ట్రాటజీ- పంత్ చాకచక్యం వల్లే అలా!: రోహిత్ - Rohit Sharma On World Cup

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.