ETV Bharat / health

చలికాలంలో గర్భిణీలు ఇవి తప్పక పాటించాలట! లేకపోతే తల్లీబిడ్డకు ప్రమాదమేనట! - PREGNANCY TIPS FOR HEALTHY BABY

-శీతాకాలంలో గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు -యోగాతో పాటు నీళ్లు ఎక్కువగా తాగాలని సలహా

pregnancy tips for healthy baby
pregnancy tips for healthy baby (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : 13 hours ago

Pregnancy Exercise Benefits: శీతాకాలంలో సాధారణంగానే రోగనిరోధక శక్తి తగ్గిపోతుందని.. ముఖ్యంగా గర్భిణుల్లో దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఫలితంగా జలుబు, దగ్గు, కీళ్లు పట్టేయడం, పొడి చర్మం వంటి సమస్యలు ఈ కాలంలో మరికొంతమందిని ఇబ్బంది పెడుతుంటాయని అంటున్నారు. అయితే, ఈ విషయంలో చిన్న జాగ్రత్తలు తీసుకుంటే.. చలికాలంలోనూ ప్రెగ్నెన్సీని ఆరోగ్యంగా ఆస్వాదించచ్చని చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అందుకే నీళ్లు తాగాలట!
మనకు వాతావరణం కాస్త చల్లగా మారితే అస్సలు దాహం అనిపించదు. అలాగని నీళ్లు తాగకుండా ఉంటే డీహైడ్రేషన్‌ బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గర్భిణులు ఈ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎందుకంటే శరీరంలో నీటి స్థాయులు తగినంత లేకపోతే ఉమ్మనీరు తగ్గిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఇది బిడ్డ ఎదుగుదలపైనా ప్రతికూల ప్రభావం చూపుతుందని వివరిస్తున్నారు. అంతేకాకుండా.. ఇదిలాగే కొనసాగితే నెలలు నిండకుండానే బిడ్డ పుట్టే అవకాశాలూ ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఏ కాలమైనా తగినంత మోతాదులో నీళ్లు తాగడం మంచిదని సలహా ఇస్తున్నారు. అలాగే మధ్యమధ్యలో కొబ్బరి నీళ్లూ తాగుతుండాలని.. ఫలితంగా ఇమ్యూనిటీ పెరుగుతుందని వెల్లడిస్తున్నారు. అలాగే ఈ సీజన్‌లో లభించే జామ, కమలాఫలం.. వంటి పండ్లను తీసుకుంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చని పేర్కొన్నారు.

అరోమా థెరపీ.. మంచిదేనట!
చలికాలంలో చాలామందిని కీళ్ల నొప్పుల సమస్య వేధిస్తుంటుంది. చల్లటి గాలులకు శరీరంలోని రక్తనాళాలు కుచించుకుపోయి రక్తప్రసరణ నెమ్మదిగా జరిగి.. ఫలితంగా కండరాలు, కీళ్లు బిగుసుకుపోతాయని అంటున్నారు. ఇంకా గుండెకూ రక్త ప్రసరణ సాఫీగా సాగదని నిపుణులు చెబుతున్నారు. గర్భిణుల్లో ఇలాంటి సమస్యలుంటే అది కడుపులో ఎదిగే బిడ్డకూ ప్రమాదమేనని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలున్న వారు డాక్టర్‌ సలహా మేరకు సంబంధిత నిపుణుల చేత అరోమా థెరపీ తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. ఈ క్రమంలో లావెండర్‌, టీట్రీ, యూకలిప్టస్‌ వంటి అత్యవసర నూనెలతో శరీరమంతా మసాజ్‌ చేసుకోవడం వల్ల రక్తప్రసరణ మెరుగవుతుందని సూచిస్తున్నారు. తద్వారా శారీరక నొప్పులు తగ్గడమే కాకుండా.. చురుకుదనమూ వస్తుందని వివరిస్తున్నారు. అలాగే పొడి చర్మం సమస్య నుంచి కూడా విముక్తి పొందచ్చని చెబుతున్నారు.

చర్మ సంరక్షణ తప్పనిసరి!
చలికాలం అనగానే చర్మం పొడిబారడం వల్ల దురద, మంట వంటి సమస్యలు గుర్తుకు వస్తుంటాయి. ఇక గర్భిణుల్లోనైతే పొట్ట పెరిగిన కొద్దీ చర్మం సాగుతూ పగిలి.. ఆ ప్రదేశంలో దురద ఎక్కువ అవుతుందని నిపుణులు అంటున్నారు. దీనివల్ల ముందు ముందు స్ట్రెచ్‌మార్క్స్‌ ఏర్పడతాయని వెల్లడిస్తున్నారు. అందుకే వైద్యుల సలహా మేరకు ప్రత్యేక క్రీములు, లోషన్లు, నూనెలు వాడచ్చని చెబుతున్నారు. వాటితో రోజుకు ఒకటి లేదా రెండుసార్లు పొట్ట భాగంలో నెమ్మదిగా మసాజ్ చేసుకోవడం వల్ల.. అటు రక్తప్రసరణ మెరుగవడమే కాకుండా.. ఇటు చర్మం పొడిబారకుండానూ జాగ్రత్తపడచ్చని తెలిపారు. అలాగే ప్రసవానంతరం స్ట్రెచ్‌మార్క్స్‌ రాకుండా కూడా ఈ చిట్కా తోడ్పడుతుందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా గర్భిణిగా ఉన్నప్పుడు చర్మానికి వాడే సౌందర్య ఉత్పత్తుల్నీ డాక్టర్‌ సలహా మేరకు మాత్రమే వాడాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. అప్పుడే పుట్టబోయే బిడ్డపై వాటి ప్రభావం పడకుండా జాగ్రత్తపడచ్చని వివరిస్తున్నారు.

యోగాతో ఉత్సాహంగా!
చలికాలంలో ఉదయాన్నే లేవాలంటే శరీరం బద్ధకంగా మారుతుంది. ఇంకా దీనికి తోడు గర్భం ధరించిన వారిలో మూడు నాలుగు నెలల పాటు వేవిళ్ల సమస్య వేధిస్తుంటుంది. ఫలితంగా శరీరం మరింత నీరసించిపోయే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. వీటన్నింటి వల్ల కడుపులో పెరిగే బిడ్డ పైనా ప్రతికూల ప్రభావం పడే అవకాశాలు ఎక్కువంటున్నారు నిపుణులు. అందుకే రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే వ్యాయామం, ధ్యానం, యోగాను రోజువారీ రొటీన్‌లో భాగం చేసుకోమంటున్నారు. ఫలితంగా బిడ్డ ఆరోగ్యంతో పాటు తల్లికి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటుందని అంటున్నారు. 2017లో American Journal of Obstetrics and Gynecology (AJOG)లో ప్రచురితమైన "Exercise and Pregnancy: A Review of the Literature" అనే అధ్యయనంలోనూ ఈ విషయం తేలింది. కానీ, నిపుణుల సలహా మేరకు మీరు సౌకర్యంగా ఉండే వ్యాయామాలే చేయాల్సి ఉంటుందని వివరిస్తున్నారు. వ్యాయామం వల్ల శరీరం ఉత్తేజితమవడమే కాకుండా మనసుకూ ప్రశాంతత చేకూరుతుందని అంటున్నారు. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

డెలివరీ తర్వాత ఎలాంటి ఫుడ్ తినాలి? ఇప్పుడు తినకపోతే ఫ్యూచర్​లో ఇబ్బందులు వస్తాయట!

గాల్ బ్లాడర్​లో రాళ్లతో ఇబ్బందులా? ఆపరేషన్ లేకుండానే ఈజీగా కరిగించుకోవచ్చట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.