Staff Facing Difficulties in Carrying Out Electrical Repairs : అదో కొండ. పైన 33కేవీ విద్యుత్ లైన్ స్తంభం ఉంది. గతంలో ఎలాంటి మరమ్మతులు వచ్చినా చేయడానికి సిబ్బంది కొండపైకి ఎక్కడం సులువుగానే ఉండేది. ఈ మధ్య కాలంలో కొందరు స్వార్థపరులు మొరం కోసం ఇలా కొండను తవ్వేయడంతో సిబ్బందికి కష్టాలు మొదలయ్యాయి.
పైకి వెళ్లడానికి వీల్లేని దుర్భర స్థితిలో నిచ్చెనను అంచెలంచెలుగా వేసుకుని తాడుతో ఒకరికొకరు సాయం చేసుకుంటూ సాహసం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ మాత్రం పట్టు తప్పినా ప్రమాదమే. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కుప్టి ఘాట్ వద్ద ఉన్న ఈ విద్యుత్ లైన్‌లో జంపర్ చెడిపోయింది. దానికి ఆదివారం మరమ్మతులు చేసేందుకు వెళ్లిన సిబ్బంది, ఇలా అవస్థలు పడి సమస్యను పరిష్కరించారు.