Spot Jogging Benefits Weight Loss: ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది ఉద్యోగం, వ్యాపార నిమిత్తం వ్యాయామాలకు సమయం కేటాయించలేకపోతున్నారు. కానీ కేవలం 10 నిమిషాలు ఉన్న చోటే జాగింగ్ చేస్తే ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
గుండె ఆరోగ్యం: పది నిమిషాలు ఉన్న చోటే జాగింగ్ చేయడం ద్వారా గుండె పనితీరు వేగవంతం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా రక్త ప్రసరణ మెరుగుపడి.. గుండె సంబంధిత వ్యాధులను తగ్గిస్తుందని వివరిస్తున్నారు. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
బరువు అదుపు: శరీరంలోని కొవ్వును కరిగించడానికి జాగింగ్ ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా జాగింగ్ వల్ల 100 క్యాలరీలు ఖర్చు అవుతాయని ఓ అధ్యయనంలో తేలింది. ఫలితంగా తేలికగా బరువు తగ్గించుకోవ్చచని తెలిపారు. 2018లో Journal of Sports Science and Medicineలో ప్రచురితమైన "The effects of spot jogging on weight loss and body composition" అనే అధ్యయనంలోనూ ఈ విషయం తేలింది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
కండరాలు బలోపేతం: ఈ వ్యాయామం ద్వారా కండరాలు బలపడతాయని నిపుణులు అంటున్నారు. రోజంతా ఉత్సాహంగా ఉండడమే కాకుండా.. దీని వల్ల నీరసం, అలసట కూడా అదుపులోకి వస్తాయని వివరిస్తున్నారు.
ఆందోళన, ఒత్తిడి: ఇంకా ఆందోళన, ఒత్తిడిని తగ్గించడానికి స్పాట్ జాగింగ్ ఎంతగానో సహకరిస్తుందని నిపుణులు అంటున్నారు. ఇది ఎండార్ఫిన్లను విడుదల చేసి.. హార్మోన్ మానసిక స్థితిని మెరుగుపరుస్తుందని వివరిస్తున్నారు.
కావాల్సినంత శక్తి: పది నిమిషాల వ్యాయామంతో రోజుకు సరిపడేంత శక్తి వస్తుందని చెబుతున్నారు. ఫలితంగా ఇతర పనులను కూడా చాలా యాక్టివ్‌గా చేసుకోవచ్చని అంటున్నారు.
సుఖ నిద్ర: పని ఒత్తిడి కారణంగా చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. ఉదయాన్నే లేచి జాగింగ్ చేయడం ద్వారా రాత్రిళ్లు బాగా నిద్ర పడుతుందని వివరిస్తున్నారు.
షుగర్ స్థాయులు అదుపులో: మధుమేహంతో బాధపడేవారు ప్రతిరోజు ఓ పది నిమిషాలు జాగింగ్‌కు కేటాయిస్తే రక్తంలోని షుగర్ స్థాయులు అదుపులోకి వస్తాయని అంటున్నారు.
చర్మ నిగారింపు : ఉదయాన్నే లేచి కొన్ని నీళ్లు తాగి జాగింగ్ చేయడం ద్వారా శరీరం ఉత్తేజితమవుతుందని నిపుణులు అంటున్నారు. దీని వల్ల చర్మం నిగారించడంతో పాటు యవ్వనంగా కనిపిస్తారని తెలిపారు.
ఎంతో సౌకర్యం: స్పాట్ జాగింగ్ చేయడం రన్నింగ్ కంటే సౌకర్యవంతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కేవలం నిలబడడానికి, చేతులు చాపడానికి వీలుగా స్థలం ఉంటే చాలని అంటున్నారు. ఎంత బిజీగా ఉన్నా కేవలం పది నిమిషాలు జాగింగ్‌కు కేటాయిస్తే సరిపోతుందని తెలిపారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
డాక్టర్‌ను అడగకుండానే టెస్టులు చేసుకుంటున్నారా? సొంత వైద్యంతో గుండెకు ముప్పు తప్పదట!
కొవ్వు కరిగి సిక్స్ ప్యాక్ కావాలా? ఖర్చు లేకుండానే ఈజీగా వస్తుందట!