ETV Bharat / technology

శాంసంగ్ యూజర్లకు గుడ్​న్యూస్- వాటికి ఫ్రీ స్క్రీన్ రీప్లేస్మెంట్!

శాంసంగ్ ఇండియా కీలక నిర్ణయం- ఆ ఫోన్లకు ఉచిత స్క్రీన్ రీప్లేస్మెంట్ గడువు పొడిగింపు!

Samsung Offers Free Screen Replacement
Samsung Offers Free Screen Replacement (Sammobile)
author img

By ETV Bharat Tech Team

Published : 2 hours ago

Samsung Free Screen Replacement Program: శాంసంగ్ యూజర్లకు గుడ్​న్యూస్. ఉచితంగా అందించే స్క్రీన్ రీప్లేస్మెంట్ గడువును పొడిగిస్తూ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని శాంసంగ్ ఇండియా ఓ ప్రకటనలో వెల్లడించింది. దీంతో గ్రీన్‌ లైన్‌ సమస్య ఎదుర్కొంటున్న యూజర్లు ఫ్రీగా స్క్రీన్ రీప్లేస్మెంట్​ను పొందేందుకు మరికొన్ని రోజులు యాడ్ అయ్యాయి.

అసలేం జరిగిందంటే?: గత కొంతకాలంగా శాంసంగ్ యూజర్లు గ్రీన్​ లైన్​ సమస్యను ఎదుర్కొంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గెలాక్సీ ఎస్‌21 సిరీస్‌, గెలాక్సీ ఎస్‌21 ఎఫ్‌ఈ, గెలాక్సీ ఎస్22 అల్ట్రా వంటి మొబైల్స్​లో సాఫ్ట్​వేర్ ఇన్‌స్టాల్‌ చేసే సమయంలో గ్రీన్‌ లైన్‌ ఇష్యూ వస్తోంది. స్క్రీన్‌పై గ్రీన్​ కలర్​లో ఓ గీత దర్శనమిస్తోందని దీనిపై పలువురు ఫిర్యాదు చేశారు.

శాంసంగ్ యూజర్లు తమ సమస్యను తెలియజేస్తూ ఈ సోషల్ మీడియా వేదికగా పరిష్కారాన్ని కోరారు. దీంతో దీనిపై స్పందించిన శాంసంగ్ కంపెనీ.. భారత్‌లోని యూజర్లకు ఉచితంగా ఒక్కసారి స్క్రీన్‌ రీప్లేస్‌మెంట్‌ అందించాలని నిర్ణయం తీసుకుంది. ఆ గడువు సెప్టెంబర్‌ 30తో ముగియగా.. తాజాగా డిసెంబర్‌ 31 వరకు దాన్ని పొడిగిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.

ఈ సేవలు పొందేందుకు సమీపంలోని శాంసంగ్‌ సర్వీస్‌ సెంటర్​ను సంప్రదించాలని కంపెనీ సూచించింది. ఇంతకు ముందు వన్‌ప్లస్‌ కూడా ఇలాంటి సమస్యే ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో వన్​ప్లస్​ కూడా ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

యాపిల్ కూడా..: ఇదిలా ఉండగా టెక్ దిగ్గడం యాపిల్​ కూడా ఇటీవలే తన పాపులర్ పాపులర్ మోడల్స్​లో ఒకటైన 'ఐఫోన్ 14 ప్లస్' ఫోన్​ బ్యాక్​ కెమెరాను ఉచితంగా రిపేర్ చేస్తామని ప్రకటించింది. ఇందుకోసం ఒక సర్వీస్​ ప్రోగ్రామ్​ను కూడా ప్రారంభించింది. బ్యాక్ కెమెరాకు సంబంధించిన సమస్యలతో ఇబ్బందిపడుతున్న యూజర్ల ఐఫోన్​ను ఎలాంటి కాంప్లిమెంటరీ ఛార్జీలు తీసుకోకుండానే రిపేర్ చేస్తామని ప్రకటించింది. అంతేకాక ఈ ప్రకటనకు ముందే రిపేర్లు చేయించుకున్నవారికి రిపేర్​కు అయిన డబ్బులను కూడా రిఫండ్ చేస్తామని తెలిపింది. దీనిపై మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

మార్కెట్లోకి కొత్త ప్రీమియం బైక్- చూపుతిప్పుకోనివ్వని డిజైన్‌తో అగ్రెసివ్ లుక్!- ధర ఎంతో తెలిస్తే షాకే!

పినాకా రాకెట్ లాంచ‌ర్‌ టెస్ట్ సక్సెస్- దీంతో ఇండియన్ ఆర్మీ ఫైర్​పవర్ డబుల్!- DRDO ఖాతాలో మరో విజయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.