Mercedes Benz to Hike Prices in India: లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ ఇండియా కార్ల ధరలు పెంచేందుకు రెడీ అయింది. తన అన్ని మోడల్ కార్ల ధరలను 3 శాతం పెంచనున్నట్లు కంపెనీ తాజాగా ప్రకటించింది. ఈ కొత్త ధరలు 2025 జనవరి1 నుంచి అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. ద్రవ్యోల్బణం, ఫ్యూయెల్ ధరల హెచ్చుతగ్గుల కారణంగా ధరలు పెంచక తప్పలేదని కంపెనీ తెలిపింది.
"ద్రవ్యోల్బణం, ఫ్యూయెల్ ధరల్లో హెచ్చుతగ్గుల కారణంగా వ్యాపార కార్యకలాపాలపై భారీ ఒత్తిడి ఎదురవుతోంది. గత మూడు క్వార్టర్స్ నుంచి కంపెనీ నిర్వహణ వ్యయం పెరుగుతోంది. దీంతో ఈ ధరల పెంపు నిర్ణయం తీసుకున్నాం." - సీఈవో సంతోష్ అయ్యర్, మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ
కంపెనీ తీసుకున్న నిర్ణయంతో మెర్సిడెస్ బెంజ్ కార్ల ధరలు కనిష్ఠంగా రూ.2 లక్షల నుంచి గరిష్ఠంగా రూ.9 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది. అయితే డిసెంబర్ 31వ తేదీ లోపు ఈ కార్లను బుకింగ్ చేసుకున్న వారికి ఈ పెంపు ధరలు వర్తించవని కంపెనీ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా మెర్సిడెస్ బెంజ్ ప్రస్తుతం రూ.45 లక్షలు విలువైన ఏ-క్లాస్ కార్ల నుంచి రూ.3.6 కోట్ల జీ63 ఎస్‌యూవీ వరకు అనేక రకాల వాహనాలను దేశీయంగా విక్రయిస్తోంది.
మరోవైపు మెర్సిడెస్-బెంజ్ ఇటీవలే సరికొత్త కారును లాంచ్ చేసింది. స్టన్నింగ్ లుక్‌లో తన AMG C63 S E పెర్ఫార్మెన్స్ కారును ఇండియన్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ప్రీవియస్ మోడల్‌ను అప్డేట్ చేస్తూ ప్రీమియం ఫీచర్లు, అదిరిపోయే డిజైన్‌తో పాటు బెస్ట్ మైలేజీని కూడా అందించారు. ఈ కారు 3.4 సెకన్లలో 0-100kmph వేగాన్ని అందుకుంటుంది. 2025 సెకండ్ క్వార్టర్లో దీని డెలివరీలు ప్రారంభం కానున్నాయి. అయితే కంపెనీ ఈ పెర్ఫార్మెన్స్ సెడాన్ రిలీజ్ చేస్తూనే దీని ప్రీ బుకింగ్స్‌నూ ప్రారంభించింది. ఈ సందర్భంగా దీని ధర, ఫీచర్లపై మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
శాంసంగ్ యూజర్లకు గుడ్‌న్యూస్- వాటికి ఫ్రీ స్క్రీన్ రీప్లేస్మెంట్!