ETV Bharat / sports

మైక్ టైసన్ VS జేక్ పాల్ మెగా ఫైట్​కు వేళాయే - భారత్‌లో ఎక్కడ, ఎప్పుడు లైవ్‌ చూడొచ్చంటే?

19 ఏళ్ల తర్వాత బరిలో దిగుతున్న దిగ్గజ బాక్సర్​ మైక్‌ టైసన్‌.

Mike Tyson VS Jake Paul
Mike Tyson VS Jake Paul (source Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : 2 hours ago

Mike Tyson VS Jake Paul : చాలా సంవత్సరాల తర్వాత బాక్సింగ్‌ ప్రియులకు బాక్సింగ్‌ దిగ్గజం మైక్‌ టైసన్‌ (58) పంచ్‌లు చూసే అవకాశం దక్కింది. ఈ లెజెండ్‌ మరోసారి రింగ్‌లోకి దిగబోతున్నాడు. ఇన్నేళ్ల తర్వాత టైసన్‌ బరిలో దిగుతుండటం ఒక ఎత్తైతే, సంచలన విజయాలతో దూసుకుపోతున్న 27 ఏళ్ల జేక్‌ పాల్‌తో తలపడనుండటం మరో విశేషం.

ఈ బాక్సింగ్‌ మ్యాచ్‌కు ప్రపంచమంతా ఆసక్తి ఎదురు చూస్తున్న తరుణంలో ఓ ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఫైనల్‌ వెయిట్‌-ఇన్‌ సమయంలో జేక్‌ పాల్‌ను టైసన్‌ చెంప దెబ్బ కొట్టాడు. దీంతో మ్యాచ్‌ ఎలా ఉండబోతోందోననే ఆసక్తి వంద రెట్లు పెరిగింది. టైసన్‌ ఎందుకు కొట్టాడు? మ్యాచ్‌ ఎక్కడ చూడాలి? వంటి ఆసక్తికర ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం.

  • మ్యాచ్‌ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది?
    శుక్రవారం టెక్సాస్‌లోని ఆర్లింగ్టన్‌లోని AT&T స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం నవంబర్‌ 16న శనివారం ఉదయం 6 గంటలకు మ్యాచ్‌ మొదలవుతుంది.

టైసన్ బరువు 103.6 కిలోలు, జేక్‌ పాల్‌ బరువు 102.9 కిలోలు. టైసన్ 50-6 రికార్డును కలిగి ఉన్నాడు, ఇందులో 44 నాకౌట్‌లు ఉన్నాయి. అతడు గత 19 ఏళ్లలో ప్రొఫెషనల్ మ్యాచ్‌లో పాల్గొనలేదు. యూట్యూబర్‌ నుంచి ఫ్రొఫెషనల్‌ బాక్సర్‌గా మారిన జేక్ పాల్‌ 9-1 రికార్డుతో ఉన్నాడు. ఇందులో 7 నాకౌట్‌ విజయాలు ఉండటం గమనార్హం. ఈ ఫైట్ కోసం పాల్ 40 మిలియన్ల యూఎస్‌ డాలర్లు అందుకోగా, టైసన్ 20 మిలియన్ యూఎస్‌ డాలర్లు అందుకోనున్నాడు.

  • జేక్‌ పాల్‌ను ఎందుకు కొట్టాడు?
    బాక్సింగ్ మ్యాచ్ ఫైనల్ వెయిట్-ఇన్ సమయంలో ఊహించని ఘటన జరిగింది. ఆర్లింగ్టన్‌లోని AT&T స్టేడియంలో భారీగా హాజరైన ప్రేక్షకుల ముందు పాల్‌ను టైసన్‌ చెంపదెబ్బ కొట్టాడు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన గురించి టైసన్ సన్నిహిత మిత్రుడు టామ్ పట్టి మాట్లాడుతూ, "బరువు కొలిచే సమయంలో టైసన్ బొటనవేలిని పాల్‌ తొక్కాడు. అందుకే టైసన్‌ చెంపదెబ్బ కొట్టాడు." అని చెప్పాడు. అయితే చెంపదెబ్బ కొట్టడాన్ని చాలా మంది నెటిజన్లు సమర్థిస్తున్నారు. దాన్ని ప్రతిచర్యగానే చూడాలని చెబుతున్నారు.

మ్యాచ్‌కు ముందు జేక్‌ మాట్లాడుతూ, "నాకు ప్రేక్షకుల సపోర్ట్‌ ఉండకపోవచ్చు. వారు మైక్ టైసన్ అభిమానులు అని నేను భావిస్తున్నాను. నేను బాక్సింగ్‌లో కొత్త వ్యక్తిని. నేను చెడ్డ వ్యక్తిగా నా కెరీర్‌ను నిర్మించుకున్నాను. కాబట్టి ప్రజలు నాకు వ్యతిరేకంగా ఉండటం సహజం. ఇదంతా నిజానికి బాక్సింగ్ క్రీడకు మేలు చేస్తుంది. కెవిన్ మెక్‌బ్రైడ్‌తో జరిగిన నా చివరి మ్యాచ్‌ నుంచి నేను చాలా కష్టాలు ఎదుర్కొన్నాను. రీహ్యాబిటేషన్‌ సెంటర్‌కు వెళ్ళాను, జైల్లో గడిపాను. మళ్లీ నాకు బాక్సింగ్‌ రింగ్‌లో దిగే అవకాశం వస్తుంది అనుకోలేదు.ఠ అని చెప్పాడు.

  • బాక్సింగ్‌ మ్యాచ్‌ ఎక్కడ చూడవచ్చు?
    మైక్ టైసన్ vs జేక్ పాల్ లైవ్ స్ట్రీమ్ భారతదేశంలో అందుబాటులో ఉండదు. అయితే బాక్సింగ్ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్‌ను నెట్‌ఫ్లిక్స్‌లో చూడవచ్చు. ఇందుకు మీకు నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ అవసరం, ఉచితంగా చూడలేరు.

2028 ఒలింపిక్స్​లో క్రికెట్- ఆతిథ్య నగరానికి 3వేల మైళ్ల దూరంలో పోటీలు- ఎందుకంటే?

ఛాంపియన్స్ ట్రోఫీ కొత్త ట్విస్ట్- టోర్నీ భారత్​కు​ షిఫ్ట్ అయ్యే ఛాన్స్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.