Anshul Kamboj 10 Wickets : హరియాణా యంగ్ ప్లేయర్ అన్షుల్ కంబోజ్ కెరీర్లో అరుదైన ఘనత సాధించాడు. రంజీ మ్యాచ్లో ఒకే ఇన్నింగ్స్లో పది వికెట్లు పడగొట్టి రేర్ రికార్డు అందుకున్నాడు. లాహ్లీ బన్సీలాల్ స్టేడియం వేదికగా జరుగుతున్న హరియాణా- కేరళ మ్యాచ్లో అన్షుల్ ఈ రికార్డు నమోదు చేశాడు. దీంతో రంజీ హిస్టరీలో ఈ ఫీట్ నమోదు చేసిన మూడో బౌలర్గా అన్షుల్ రికార్డులకెక్కాడు. అయితే గత 39ఏళ్లలో మాత్రం ఇదే తొలిసారి.
రంజీలో ఈ ఘనత సాధించిన బౌలర్లు
- 1956 - ప్రేమాంగ్స్ ఛటర్జీ (బంగాల్) vs అస్సాం - 10/20
- 1985 - ప్రదీప్ సుందరం (రాజస్థాన్) vs విదర్భ - 10/78
- 2024- అన్షుల్ కంబోజ్ (హరియాణా) vs కేరళ - 10 /49
23ఏళ్ల అన్షుల్ దెబ్బకు కేరళ తొలి ఇన్నింగ్స్లో 291 పరుగులకు ఆలౌటైంది. ఈ ఇన్నింగ్స్లో 30.1 ఓవర్లు బౌలింగ్ చేసిన అన్షుల్ 49 పరుగులిచ్చి 10 వికెట్లు దక్కించుకున్నాడు. అందులో 9 మెయిడెన్లు ఉన్నాయి.
𝐖.𝐎.𝐖! 🔥
— BCCI Domestic (@BCCIdomestic) November 15, 2024
Haryana Pacer Anshul Kamboj has taken all 1⃣0⃣ Kerala wickets in the 1st innings in #RanjiTrophy 🙌
He's just the 6th Indian bowler to achieve this feat in First-Class cricket & only the 3rd in Ranji Trophy 👏
Scorecard: https://t.co/SeqvmjOSUW@IDFCFIRSTBank pic.twitter.com/mMACNq4MAD