ETV Bharat / entertainment

మలయాళ డైరెక్టర్​తో నాని కొత్త మూవీ! - నేచురల్ స్టార్ లైనప్​లో ఎన్ని సినిమాలంటే? - NANI MALAYALAM DIRECTOR VIPIN DAS

మరో సినిమాను లైన్​లో పెట్టిన నేచురల్ స్టార్ నాని - దర్శకుడు ఎవరంటే?

Hero Nani With Malayalam Director
Hero Nani With Malayalam Director (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 15, 2024, 3:18 PM IST

Hero Nani With Malayalam Director : కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ విభిన్న కథలను ప్రేక్షకులకు పరిచయం చేస్తుంటారు హీరో నేచురల్ స్టార్ నాని. దసరా సినిమాతో తొలిసారి రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిన ఆయన ఆ తర్వాత కూడా వరుసగా హిట్లను అందుకుంటూ కెరీర్​లో ముందుకెళ్తున్నారు. రీసెంట్​గానే డిఫరెంట్ కాన్సెప్ట్​ సరిపోదా శనివారం చిత్రంతోనూ రూ. 100 కోట్లకుపైగా వసూళ్లు (గ్రాస్‌) అందుకున్నారు.

ప్రస్తుతం నాని చేతిలో వరుస ప్రాజెక్ట్​లు ఉన్నాయి. ఇవి పూర్తవ్వకుండానే ఆయన కొత్త సినిమాలను లైన్​లో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆయన ఓ మలయాళ దర్శకుడితో సినిమా చేసేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం ఫిల్మ్ నగర్​లో చక్కర్లు కొడుతోంది.

గతంలో నాని షైన్ స్క్రీన్స్‌ బ్యానర్​పై సాహు గారపాటితో కలిసి టక్ జగదీష్ కోసం పని చేశారు. ఇప్పుడు వీరిద్దరూ మళ్లీ కలిసి పని చేయబోతున్నట్లు సమాచారం. అలా ఈసారి తమ చిత్రానికి మలయాళ దర్శకుడు విపిన్ దాస్ దర్శకత్వం వహించబోతున్నట్లు తెలిసింది. జయ జయ జయ జయ హే, గురువాయూర్ అంబలనాదయిల్ వంటి చిత్రాలకు విపిన్ దాస్​ దర్శకత్వం వహించారు. విపిన్ దాస్ చెప్పిన కథ ఆలోచన నచ్చి హీరో నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం అందింది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్​ గురించి అధికారిక ప్రకటన రానుందట.

ప్రస్తుతం నాని, శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 (Nani Hit 3 Movie) చిత్రాన్ని చేస్తున్నారు. ఈ చిత్రం 2025 వేసవికి రిలీజ్​ కానుంది. శ్రీకాంత్ ఒదెల చిత్రాన్ని కూడా నాని ప్రారంభించారు. ఇది వచ్చే ఏడాది ప్రారంభంలో షూటింగ్ ప్రారంభించుకోనుంది. ఈ చిత్రాలతో పాటు నాని దర్శకుడు సుజీత్‌తోనూ ఓ యాక్షన్ మూవీ కోసం చర్చలు జరుపుతున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. ఈ చిత్రాలన్నీ పూర్తవ్వగానే నాని, విపిన్ దాస్​తో చిత్రాన్ని 2026లో చేస్తారని టాక్ వినిపిస్తోంది. అంటే ఇప్పుడు నాని ఖాతాలో దాదాపు నాలుగు చిత్రాల వరకు ఉన్నట్టే!.

పవన్ కల్యాణ్ గురించి బాలయ్య ప్రశ్న - ఆసక్తికర సమాధానమిచ్చిన అల్లు అర్జున్​

యాక్షన్​ మల్టీస్టారర్​లో స్టార్ డైరెక్టర్​ కూతురు - 'వెన్నెల'గా టాలీవుడ్​ ఎంట్రీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.