How to Organise Fridge : ప్రస్తుత కాలంలో దాదాపు అందరి ఇళ్లలోనూ.. రిఫ్రిజిరేటర్ కామన్‌గా ఉంటోంది. పండ్లు, కూరగాయలు, పాలు, పెరుగు వంటివి తాజాగా ఉండడానికి ఫ్రిడ్జ్ ఎంతో ఉపయోగపడుతోంది. అలాగే చాలా మంది వారానికి సరిపడా ఇడ్లీ, దోశ పిండి తయారు చేసుకుని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటారు. అయితే.. ఎక్కువ మంది ఫ్రిడ్జ్‌లో పండ్లు, కూరగాయలు, మాంసం.. అన్నీ ఒకేచోట సర్దేస్తుంటారు. దీనివల్ల ఫ్రిడ్జ్ డోర్ తీయగానే దుర్వాసన వస్తుంది. అయితే, ఫ్రిడ్జ్ నుంచి బ్యాడ్ స్మెల్ రాకుండా, చక్కగా ఎలా సర్దుకోవాలో ఇప్పుడు చూద్దాం.
పండ్లు, కూరగాయలను ఇలా :
కొంత మంది మార్కెట్ నుంచి పండ్లు, కూరగాయలు తీసుకొచ్చిన తర్వాత కడిగి.. అన్నీ ఫ్రిడ్జ్‌లో ఒకేచోట పెడుతుంటారు. కానీ, ఇలా చేయకూడదు. వాటిని శుభ్రం చేసిన తర్వాత ఒక్కో రకాన్ని ఒక్కో కాగితపు లేదా ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేయాలి. ఇలా చేస్తే తాజాగా ఉండడంతో పాటు.. ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన రాదు. పండ్లను ఓ షెల్ఫ్‌లో, కూరగాయల్ని మరో దాంట్లో ఉండేలా సర్దుకుంటే మంచిది.
నాన్‌వెజ్ ఇలా స్టోర్ చేయండి :
కొందరు చికెన్, మటన్, చేపలు వంటివి ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెడుతుంటారు. అయితే, పచ్చి మాంసాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టాలనుకున్నప్పుడు.. మూత ఉన్న బాక్స్ లేదా ఎయిర్‌టైట్ కంటైనర్‌లో ఉంచాలి. దీనిని వేరే షెల్ఫ్‌లో ఉంచాలి. వండని మాంసం, చేపలు వంటి వాటిని కూరగాయలు, పండ్లకు దూరంగా పెట్టాలి. లేకపోతే వాటిపై ఉండే బ్యాక్టీరియా పండ్లు, కూరగాయలకు వ్యాపించి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది.
టాప్ షెల్ఫ్‌లో :
సాధారణంగానే ఫ్రిడ్జ్‌లోని టాప్ షెల్ఫ్‌లు కాస్త వెచ్చగా ఉంటాయి. కాబట్టి అక్కడ ఫ్రెష్ ఉత్పత్తులను ఉంచకండి. టాప్ షెల్ఫ్‌లో గుడ్లు, సాస్‌లు, ప్యాకేజ్డ్ జ్యూస్‌లు, అల్లం-వెల్లుల్లి పేస్ట్ వంటివి సర్దండి.
మిడిల్ షెల్ఫ్‌లో :
దీనిలో పాలు, పాల పదార్థాలను ఉంచండి. అలాగే కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వంటి వాటిని తెంపి ఎయిర్‌టైట్ బాక్స్‌లో టిష్యూ పేపర్ వేసి స్టోర్ చేయండి.
కింది షెల్ఫ్‌లో :
ఫ్రిడ్జ్‌లోని కింది భాగం చాలా చల్లగా ఉంటుంది. కాబట్టి, ఈ భాగంలో పండ్లు కూరగాయలను వివిధ జిప్ కవర్లలో ప్యాక్ చేసి సర్దుకోండి. ఇలా చేస్తే అవి ఎక్కువ రోజులపాటు తాజాగా ఉంటాయి.
డోర్ :
డోర్ ఫ్రిడ్జ్ భాగం కాస్త వెచ్చగా ఉంటుంది. కాబట్టి.. మీరు ఇక్కడ మసాలా దినుసులను స్టోర్ చేసుకోవాలి.
మరికొన్ని చిట్కాలు..
- పండ్లు, కూరగాయలు, మాంసాన్ని.. కట్ చేయడం కోసం దాదాపు చాలా మంది ఒకే చాకులు ఉపయోగిస్తుంటారు. కానీ, అలా కాకుండా వేర్వేరు చాకులు ఎంచుకోవడం మంచిది. ఈ నియమం వంట పాత్రలకూ వర్తిస్తుంది.
- అలాగే వంట మొదలు పెట్టడానికి ముందు చేతుల్ని శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. కూరగాయలు, ఆకుకూరలను ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటిలో కడిగి వండుకుంటే మంచిది.
ఇవి కూడా చదవండి :
ఎంత తొలగించినా ఫ్రీజర్‌లో ఐస్ పేరుకుపోతోందా? - ఇలా చేశారంటే ఆ సమస్యే ఉండదిక!
ఫ్రిజ్‌లో పెట్టిన పండ్లు, కూరగాయలు త్వరగా పాడవుతున్నాయా? - ఇలా చేశారంటే ఎక్కువ రోజులు ఫ్రెష్!