EX MLA Gummadi Narsaiah on CM Revanth : తాను 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశానని, ప్రజా సమస్యలను విన్నవించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలవాలని నాలుగుసార్లు యత్నించినప్పటికీ ఫలితం లేకపోయిందని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య వాపోయారు. ఈ మేరకు ఆయన మాట్లాడిన ఓ వీడియో సోషల్ మీడియాలో గురువారం వైరల్‌గా మారింది. ఈ విషయమై హైదరాబాద్‌లో ఉన్న గుమ్మడి నర్సయ్యను ‘న్యూస్‌టుడే’ ఫోన్లో సంప్రదించగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు ఇప్పటివరకు నాలుగుసార్లు యత్నించానని తెలిపారు.
తెలిసిన నేతలు, అధికారులకు ఫోన్ చేస్తే రమ్మంటున్నారు కానీ సీఎంను కలిసే అవకాశం మాత్రం ఇవ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీతారామ ప్రాజెక్టు, చెక్‌డ్యాంలు, పోడు భూములు, ఎత్తిపోతల పథకాల సమస్యలను సీఎంకు విన్నవించాలని ప్రయత్నిస్తున్నానని ఆయన తెలిపారు. ఇంటి గేటు వద్దనే నిలువరిస్తున్నారు అని గుమ్మడి నర్సయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
World Bicycle Day : సైకిల్‌తో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి అనుబంధం