ETV Bharat / spiritual

'కార్తిక మాసంలో ఈ శనివారం - "శంఖుచక్ర దీపం" వెలిగించండి - వేంకటేశ్వరుడి ఆశీర్వాదం మీపైనే'

- పూజ గదిలో ఈ నియమాలు పాటించండి

Venkateswara Shankhu Chakradeepam Telugu
Venkateswara Shankhu Chakradeepam Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

Venkateswara Shankhu Chakradeepam Telugu : కార్తిక మాసం అంటేనే.. దీపాలకు ప్రాధాన్యత ఉన్న మాసం. పరమ పవిత్రమైన ఈ కార్తిక మాసంలో చాలా మంది శివాలయం, విష్ణు ఆలయం, వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో దీపాలు వెలిగిస్తుంటారు. అయితే, కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే వేంకటేశ్వర స్వామి అనుగ్రహం కలగాలంటే.. ఇంట్లో "వేంకటేశ్వర శంఖుచక్ర దీపం" వెలిగించాలని ప్రముఖ జ్యోతిష్య పండితుడు మాచిరాజు కిరణ్​ కుమార్​ చెబుతున్నారు.

ఈ దీపాన్ని కార్తికంలో ఏ రోజైనా వెలిగించవచ్చు. అయితే.. వెంకన్న స్వామికి ప్రీతికరమైన శనివారం రోజున వెలిగిస్తే ఇంకా మంచిదని అంటున్నారు. వేంకటేశ్వర శంఖుచక్ర దీపం వెలిగించడం వల్ల కలి బాధలు, కలి పీడలన్నీ తొలగిపోతాయట. ఇంట్లో ఈ దీపాన్ని ఎలా వెలిగించాలో ఇప్పుడు చూద్దాం.

  • ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. తలస్నానం చేసిన తర్వాత పూజ గదిని సుందరంగా అలంకరించుకోవాలి.
  • తర్వాత పూజ గదిలో శ్రీదేవి, భూదేవి సమేతంగా ఉన్నటువంటి వేంకటేశ్వర స్వామి ఫొటోకి గంధం, కుంకుమతో బొట్లు పెట్టాలి.
  • అలాగే ఆ ఫొటో దగ్గర మామూలుగా దీపాలు వెలిగించుకోవాలి.
  • ఇప్పుడు ఫొటో దగ్గర ఒక పీట ఏర్పాటు చేసుకోవాలి. పీటకు పసుపు, కుంకుమ బొట్లు పెట్టాలి.
  • పీటపై అష్టదళ పద్మం ముగ్గు వేయాలి. స్వామి వారికి ఈ ముగ్గు ఎంతో ప్రీతికరమైనది. (ఎనిమిది దళాలున్నటువంటి ముగ్గును 'అష్టదళ పద్మం' ముగ్గు అంటారు)
  • పీట మీద రెండు ఇత్తడి లేదా మట్టి ప్రమిదలను ఏర్పాటు చేసుకోవాలి. వాటికి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు బియ్యం పిండి, బెల్లం తురుము, ఆవు పాలతో ప్రత్యేకంగా 2 పిండి దీపాలను తయారు చేయాలి. పిండి దీపాలను ఇత్తడి లేదా మట్టి ప్రమిదల్లో ఉంచాలి.
  • పిండి దీపాలకు తడి గంధంతో తిరు నామాలను దిద్దాలి. ఇప్పుడు పిండి దీపాల్లో ఆవు నెయ్యి పోయండి. ఆవు నెయ్యిలో తడిపినటువంటి కుంభ వత్తులు వేసి జ్యోతులు వెలిగించాలి.
  • ఆ తర్వాత లోహంతో తయారు చేసిన చిన్న చక్రం లేదా శంఖువు.. పిండి దీపానికి అలంకరించుకోవాలి. (లోహంతో తయారు చేసిన చిన్న చక్రం, శంఖువు పూజ సామాగ్రి దుకాణంలో లభిస్తాయి)
  • ఇలా ప్రత్యేకంగా కార్తిక మాసంలో జ్యోతిని వెలిగించే విధానాన్ని వేంకటేశ్వర శంఖుచక్ర దీపాలు అని అంటారు.
  • ఈ దీపాన్ని వెలిగించడం ద్వారా వేంకటేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. అలాగే కలి బాధలు, పీడలు, దోషాలన్నీ తొలగిపోతాయని మాచిరాజు కిరణ్​ కుమార్​ చెబుతున్నారు.

ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు జ్యోతిష్యులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ఇవి కూడా చదవండి :

కార్తిక పూర్ణిమ సాయంత్రం - తులసి కోట వద్ద తల్లులు ఇలా పూజ చేస్తే - పిల్లల జీవితం బాగుంటుందట!

'అప్పుల బాధలు తీరట్లేదా? - కార్తిక మాసంలో "కందుల దీపం" వెలిగిస్తే విశేష ఫలితం!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.