2028 Los Angeles Olympics Cricket : 2028 ఒలింపిక్ గేమ్స్‌కు లాస్ ఏంజిలెస్ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈసారి క్రికెట్ పోటీలు కూడా ఉండనున్నాయి. దాదాపు 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు లభించింది. 1990 ఒలింపిక్స్‌లో క్రికెట్ పోటీలు జరిగాయి. అయితే ఈ విశ్వ క్రీడలకు లాస్ ఏంజిలెస్ వేదిక కానున్నప్పటికీ, క్రికెట్ పోటీలు మాత్రం న్యూయార్క్‌లో నిర్వహించే ఛాన్స్ ఉన్నట్లు తెలిసింది.
లాస్ ఏంజిలెస్‌లో క్రికెట్ గేమ్‌కు సరిపోయే మైదానాలు అందుబాటులో లేవనే కారణంతో మ్యాచ్‌లను న్యూయార్క్‌లో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే లాస్ ఏంజిలెస్ - న్యూయార్క్‌కు మధ్య దాదాపు 3 వేల మైళ్ల దూరం ఉంటుంది. దీనిపై లాస్ ఏంజిలెస్ ఒలింపిక్స్ ఛైర్మన్ వాసర్‌మెన్ స్పందించారు. 2028లో పోటీల్లో క్రికెట్ మ్యాచ్‌లు విజయవంతం అయ్యేలా చూస్తామని అన్నారు.
'లాస్ ఏంజిలెస్‌లో మాకు క్రికెట్ స్టేడియాలు లేవు. ఈ మైదానాల కోసం సరైన ప్రాంతాలను వెతకాల్సి ఉంది. రానున్న పోటీల్లో క్రికెట్ మ్యాచ్‌లు మరింత విజయం సాధించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం. ఒకవేళ లాస్ ఏంజిలెస్‌లోనే ఉత్తమ స్టేడియాలు దొరికితే ఇక్కడే మ్యాచ్‌లు నిర్వహిస్తాం. అలా సాధ్యం కాకపోతే ప్రత్యామ్నాయంగా ఉత్తమ ప్రాంతానికే మ్యాచ్‌లను తరలిస్తాం' అని కాసే వాసర్‌మన్ వెల్లడించారు.
కాగా, 2024 టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో మ్యాచ్‌లు కొన్ని న్యూయార్క్ స్టేడియంలో జరిగాయి. వీటికి ప్రేక్షకాదరణ కూడా బాగానే లభించింది. దీంతో ఒలింపిక్ అధికారులు ఇప్పటికే న్యూయార్క్ స్టేడియం మేనేజ్‌మెంట్‌తో సంప్రదింపులు జరిపారు. క్రికెట్ మాత్రమే కాకుండా సాఫ్ట్ బాల్, కానోయ్‌ను కూడా దాదాపు 1,300 మైళ్ల దూరంలోని ఓక్లాహోమాలో నిర్వహించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
2024 పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో భారత్ ఆరు పతకాలు సాధించింది. అందులో 1 సిల్వర్, 5 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. తర్వాత జరిగిన పారాలింపిక్స్‌లో భారత పారా అథ్లెట్లు అదరగొట్టారు. మొత్తం 29 పతకాలు సాధించారు. అందులో 7 గోల్డ్, 9 సిల్వర్, 13 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి.
'2028 ఒలింపిక్స్‌లో ఆడతా- కమ్‌బ్యాక్ మామూలుగా ఉండదు!'
'ఒలింపిక్స్‌కు ఆతిథ్యమివ్వడం భారత్ కల- దానికి ఇప్పట్నుంచే రెడీ అవుతున్నాం' - Olympics 2036