ETV Bharat / offbeat

కార్తిక మాసం స్పెషల్​ - ఉల్లి, వెల్లుల్లి లేకుండా అద్దిరిపోయే రుచితో "ఆలూ కుర్మా" - ఇలా ట్రై చేయండి!

-కార్తిక మాసంలో ఉల్లి వెల్లుల్లి తినని వారికి బెస్ట్​ ఆప్షన్​ -తక్కువ పదార్థాలతో ఇంట్లోనే టేస్టీగా ప్రిపేర్​ చేసుకోవచ్చు

How to Make Aloo Kurma Without Onion and Garlic
How to Make Aloo Kurma Without Onion and Garlic (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 14, 2024, 2:15 PM IST

How to Make Aloo Kurma Without Onion and Garlic: కార్తిక మాసం పూజలకు పెట్టింది పేరు. స్నానాలు, పూజలు, దీపారాధనలు, ఉపవాసాలు.. ఎక్కడ చూసినా ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది. ఇక ఈ మాసంలో చాలా మంది ఉల్లి, వెల్లుల్లికి దూరంగా ఉంటారు. ఈ క్రమంలో అలాంటి వారు ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండా ఏదైనా రుచికరమైన కర్రీ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే వారికి ఈ రెసిపీ బెస్ట్​ ఆప్షన్​. అదే "ఆలు కుర్మా". ఈ రెసిపీని చాలా తక్కువ సమయంలో సింపుల్​గా చాలా తక్కువ పదార్థాలతో రెడీ చేసుకోవచ్చు. పైగా రుచి అద్దిరిపోతుంది. మరి, ఈ సూపర్ టేస్టీ రెసిపీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం.

కావాల్సిన పదార్థాలు:

  • ఉడికించిన బంగాళదుంపలు - 3
  • టమాటలు - 2
  • అల్లం - అర ఇంచ్​
  • పచ్చిమిర్చి - 2
  • గసగసాలు - 1 చెంచా
  • నూనె - 2 టేబుల్​ స్పూన్లు
  • జీలకర్ర - అర టీ స్పూన్​
  • పచ్చిమిర్చి - 2
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • శనగపిండి - అర టేబుల్​ స్పూన్​
  • ఉప్పు - రుచికి సరిపడా
  • పసుపు - పావు టీ స్పూన్​
  • కారం - తగినంత
  • ధనియాల పొడి - అర టీ స్పూన్​
  • గరం మసాలా - అర టీ స్పూన్​
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా

తయారీ విధానం:

  • ముందుగా బంగాళదుంపలను ఉడకబెట్టుకోవాలి. ఆ పై వాటి పొట్టు తీసి ముక్కలుగా కట్​ చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు అందులో రెండు ముక్కలు తీసి మెత్తగా మెదిపి పేస్ట్​లాగా చేసుకోవాలి.
  • ఇప్పుడు టమాట, పచ్చిమిర్చి, అల్లాన్ని సన్నగా కట్​ చేసుకోవాలి. అలాగే గసగసాలను నీటిలో నానబెట్టాలి.
  • ఇప్పుడు ముందుగా మిక్సీజార్​ తీసుకుని టమాట ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి, నానబెట్టిన గసగసాలు వేసి మెత్తగా గ్రైండ్​ చేసుకోవాలి.
  • స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి నూనె పోసుకోవాలి. ఆయిల్​ హీటెక్కిన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి.
  • ఆ తర్వాత శనగపిండి వేసి మరో నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి.
  • అనంతరం రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసి మసాలాలను ఫ్రై చేసుకోవాలి.
  • ఆ తర్వాత మిక్సీ పట్టుకున్న టమాట మిశ్రమాన్ని వేసి నూనె పైకి తేలేవరకు మగ్గించుకోవాలి. అనంతరం ఓ కప్పు నీరు పోసి కలిపిన తర్వాత ఆలూ పేస్ట్​ను వేసి బాగా కలిపి ఉడకబెట్టిన బంగాళదుంప ముక్కలు వేసి మూత పెట్టి మంటను మీడియంలో పెట్టి నూనె పైకి తేలేంతవరకు ఉడికించుకోవాలి.
  • కూర దగ్గరపడ్డాక కొత్తిమీర తరుగు చల్లి దించుకుని వేడివేడిగా సర్వ్​ చేసుకుంటే టేస్ట్​ అద్దిరిపోతుంది. చపాతీ, పూరీ, పరోటా, అన్నం.. ఇలా ఎందులోకైనా సూపర్​గా ఉంటుంది.

పదే పది నిమిషాల్లో పసందైన "పచ్చిమిర్చి వేపుడు" - వేడివేడి అన్నంలో నెయ్యితో తిన్నారంటే అమృతమే!

ఆలుగడ్డతో అద్దిరిపోయే వడలు పది నిమిషాల్లోనే! - ఇలా ప్రిపేర్ చేస్తే వహ్వా అంటారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.