India denies Visa To Pakisthan Players : ప్రస్తుతం ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 వేదిక గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. పీసీబీ, ఐసీసీ, బీసీసీఐ మధ్య తీవ్రంగా మాటామంతీ జరుగుతున్నాయి. ఓవైపు పీసీబీ తమ దేశానికి టీమ్ ఇండియా రావాలని మొండి పట్టుబడుతుంటే, మరోవైపు వచ్చేదే లేదని కరాఖండిగా చెబుతోంది భారత్. దీంతో వచ్చే ఏడాది జరగబోయే ఈ ట్రోఫీ నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అసలు ఏం జరుగుతోందో? ట్రోఫీ నిర్ణయిస్తారా లేదా అని తెలియని గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
ఈ వ్యవహరం ఇంకా పూర్తవ్వనేలేదు, ఇది కొనసాగుతున్నవేళ భారత్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్‌కు గట్టి షాక్ ఇచ్చింది. త్వరలోనే జరగబోయే ఆసియా కప్ యూత్ స్క్రాబుల్ ఛాంపియన్‌షిప్, దిల్లీ కప్ టోర్నమెంట్‌ల కోసం ఆడనున్న చాలా మంది పాక్ ప్లేయర్లకు వీసాలు ఇచ్చేందుకు భారత హైకమిషన్ నిరాకరించింది.
వాస్తవానికి పాక్ ప్లేయర్లు రెండు నెలల ముందుగానే దరఖాస్తులు సమర్పించారు. కానీ వాటిని భారత హైకమిషన్ చూసిచూడనట్లుగా వదిలేసింది. ఇప్పుడేమో తాజాగా ఆ ఆటగాళ్లకు వీసాలు జారీ చేయమని చెప్పి షాక్ ఇచ్చింది. దీంతో ఇప్పుడీ విషయం కూడా చర్చనీయాంశంగా మారింది.