IND vs PAK Champions Trophy 2025 : ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో అసలైన మ్యాచ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. దుబాయ్ వేదికగా భారత్, పాకిస్థాన్ మ్యాచ్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. 2017 ఫైనల్ ఓటమికి రివెంజ్ తీర్చుకోవాలని టీమ్ఇండియా భావిస్తుండగా, ఈ మ్యాచ్‌లో గెలిచి సెమీస్ ఆశలను నిలబెట్టుకోవాలని పాక్ కూడా పట్టుదలతో ఉంది.
ఇక రోహిత్ సేన కూడా ఈ మ్యాచ్ కోసం భారీగానే ప్రాక్టీస్ చేస్తోంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అందరికంటే రెండు, మూడు గంటల ముందు నుంచే ప్రాక్టీస్ సెషన్స్‌లో చెమటోడుస్తున్నాడు. స్పిన్నర్లను ఎదుర్కొంటూ తన బలబలాలను పరీక్షించుంటున్నాడు. మిగతా ప్లేయర్స్ కూడా నెట్స్‌లో తీవ్రంగా శ్రమించారు.
కానీ, వికెట్‌కీపర్ రిషభ్ పంత్ ప్రాక్టీస్ సెషన్స్‌కు రాలేదు. వైరల్ ఫీవర్ కారణంగా పంత్ రెస్ట్ తీసుకుంటున్నాడని, అందుకే ప్రాక్టీస్‌కు రాలేదంటూ మ్యాచ్‌కు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ క్లారిటీ ఇచ్చాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పంత్‌కు ఛాన్స్ దక్కలేదు. ఒక వేళ పాక్‌తో మ్యాచ్ వరకు అతడు ఫిట్‌గా ఉంటే తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.