TeamIndia Test Team Batting Review : 46 ఆలౌట్, 156 ఆలౌట్ - వరుసగా రెండు సార్లు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడిన టీమ్ ఇండియా, ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో ఖాతాలో వేసుకున్న పేలవ స్కోర్లు ఇవి. వరుసగా రెండు టెస్టుల్లోనూ ఇదే చెత్త ప్రదర్శనతో భారత క్రికెట్ అభిమానులను నిరాశపరిచింది.
కోహ్లీ, రోహిత్ దారుణ ప్రదర్శన(Ind VS NZ kohli Rohith) - సరే ఇదంతా ఒక ఎత్తైతే స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ దారుణమైన ప్రదర్శన చేయడం మరో ఎత్తు. కివీస్‌తో రెండు టెస్టుల్లోని మొదటి ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ వరుసగా 0, 1 చేయగా, కెప్టెన్ రోహిత్ వరుసగా 2, 0 చేశాడు.
ముఖ్యంగా కోహ్లీ ఔటైన విధానం అయితే మరీ ఆశ్చర్యపరుస్తోంది. 536 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 27 వేలకుపైగా పరుగులు, 80 సెంచరీలు చేసిన విరాట్, ఫుల్ టాస్ బంతికి ఔట్ అయ్యాడు. కెరీర్లోనే అత్యంత దారుణంగా క్లీన్ బౌల్డ్ అయ్యాడు విరాట్.
అంతకన్నా ముందు పిచ్‌పై భయంకరమైన స్వింగ్, స్పిన్ లేకపోయినా రోహిత్ శర్మ, సౌథీ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు.
ఇక ఇదే వికెట్‌పై, మెరుగైన స్పిన్నర్లు అశ్విన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ త్రయాన్ని లేథమ్ సమర్థంగా ఎదుర్కొని సెంచరీ బాదేశాడు. ఇది చూస్తే మరి మన స్టార్లకు ఏమైంది? అనే ఆందోళన కలుగుతోంది.
స్పిన్ బౌలింగ్‌లోనే ఔట్, 26 ఇన్నింగ్స్‌ల్లో 21 సార్లు(Kohli Spin Bowling) - గత నాలుగు టెస్టుల్లో కోహ్లీ 6, 17, 47, 29, 0, 70, 1 స్కోర్లు చేయగా, రోహిత్ 6, 5, 23, 8, 2, 52, 0 పరుగులు నమోదు చేశాడు. ఇంకా చెప్పాలంటే టెస్టుల్లో స్పిన్ బౌలింగ్ కోహ్లీకి క్లిష్టంగా మారుతోందనిపిస్తోంది. గత మూడేళ్లలో ఉపఖండంలో 26 ఇన్నింగ్స్‌ల్లో 21 సార్లు విరాట్ స్పిన్నర్ల బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. టెస్టుల్లో కోహ్లీ సెంచరీ బాది ఏడాది దాటిపోయింది. 2021 జనవరి నుంచి 30 టెస్టులు ఆడిన విరాట్, 34.69 యావరేజ్‌తో 1700 పరుగులు చేశాడు.
రోహిత్ కూడా(Rohith Last 30 Test Stats) - రోహిత్ శర్మ కూడా మూడేళ్లుగా తన స్థాయికి తగ్గట్టు ప్రదర్శన చేయట్లేదు. గత 31 టెస్టుల్లో హిట్ మ్యాన్ గణాంకాలు పరిశీలిస్తే అతడు 40.23 యావరేజ్‌తో 2092 రన్స్ సాధించాడు. అలా విరాట్, రోహిత్ ఆటతరు నానాటికీ తీసికట్టుగా మారుతోంది.
రిషభ్, సర్ఫరాజ్ ఔటైనా విధానం కూడా(panth sarfaraz) - పుణె టెస్ట్‌లో విరాట్‌తో పాటు రిషభ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్ ఔటైన విధానం కూడా దారుణం. ఫిలిప్స్ లాంటి స్పిన్నర్ చేతిలో పంత్ క్లీన్ బౌల్డ్ అవ్వడం అనేది అతడి స్థాయికి ఏమాత్రం తగదనే చెప్పాలి. సర్ఫరాజ్ కూడా ఓ సాధారణ ప్లేయర్లా ఔట్ అయ్యాడు.