తెలంగాణ

telangana

ETV Bharat / sports

విశాఖ టెస్టులో భారత్ విజయం- 1-1తో సిరీస్ సమం - bumrah vs eng test 2024

IND VS ENG Test series:తొలి టెస్టులో ఇంగ్లాండ్​ చేతిలో ఓడిన టీమ్​ఇండియా రెండో మ్యాచ్​లో విజయం సాధించింది. 106 పరుగుల తేడాతో ఇంగ్లాండ్​ను చిత్తు చేసింది. ఈ విజయంతో భారత్ ఐదు మ్యాచ్​ల సిరీస్​ను 1-1తో సమం చేసింది.

IND VS ENG
IND VS ENG

By ETV Bharat Telugu Team

Published : Feb 5, 2024, 2:17 PM IST

Updated : Feb 5, 2024, 3:07 PM IST

IND VS ENG Test series: విశాఖపట్టణం టెస్టులో ఇంగ్లాండ్​పై భారత్ 106 పరుగుల తేడాతో నెగ్గింది. భారత్ నిర్దేశించిన 399 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 292కే కుప్పకూలింది. జాక్ క్రాలీ (73 పరుగులు) మినహా మిగతావారెవరూ రాణించలేదు. ఇక టీమ్ఇండియా బౌలర్లలో జస్ర్పీత్ బుమ్రా 3, రవిచంద్రన్ అశ్విన్ 3, అక్షర్ పటేల్, కుల్​దీప్ యాదవ్, ముకేశ్ కుమార్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఇక రెండు ఇన్నింగ్స్​లో కలిపి 9 వికెట్లు పడగొట్టిన పేసర్ బుమ్రాకు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. ఈ విజయంలో ఐదు మ్యాచ్​ల టెస్టు సిరీస్​ను భారత్ 1-1తో సమం చేసింది. ఇరుజట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ ఫిబ్రవరి 15నుంచి రాజ్​కోట్​ వేదికగా జరగనుంది.

ఓవర్​నైట్ స్కోర్ 67-1తో నాలుగోరోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. రెహాన్ అహ్మద్ (28), ఒల్లీ పోప్ (23), జో రూట్ (16), జాని బెయిర్​స్టో (26), క్రాలీ (76) తొలి సెషన్​లోనే ఔటయ్యారు. దీంతో భారత్ విజయావకాశాలు మెరుగుపర్చుకుంది. అయినప్పటికీ ఇంగ్లాండ్ దూకుడుగా ఆడి పరుగులు సాధించింది. ఇక చివర్లో బెన్ ఫోక్స్ (36), టామ్ హార్ల్టీ (36) కాసేపు పోరాడి, ఓటమి అంతరాన్ని తగ్గించారు.

అంతకుముందు తొలి ఇన్నింగ్స్​లో భారత్ 396-10 భారీ స్కోర్ నమోదు చేసింది. యంగ్ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ (209) డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. అనంతరం ఇంగ్లాండ్ 253 పరుగులకే కుప్పకూలింది. జాక్ క్రాలీ (76) మినహా మిగతా బ్యాటర్లు ఆకట్టుకోలేదు. ఈ ఇన్నింగ్స్​లో టీమ్ఇండియా స్టార్ పేసర్ బుమ్రా 6 వికెట్లతో ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. తర్వాత రెండో ఇన్నింగ్స్​లో భారత్​ 255 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్​లో మరో యంగ్ బ్యాటర్ శుభ్​మన్ గిల్ (104) సెంచరీతో ఆకట్టుకున్నాడు.

ఇరుజట్ల స్కోర్లు:

  • భారత్ తొలి ఇన్నింగ్స్‌- 396/10
  • ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌- 253/10
  • భారత్ రెండో ఇన్నింగ్స్‌- 255/10
  • ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌- 292/10

టీమ్​ఇండియాకు బిగ్ షాక్​ - రెండో టెస్టులో సెంచరీ హీరోకు గాయం

'అది నాకూ తెలీదు- అయ్యర్ వల్లే ఇదంతా': గిల్

Last Updated : Feb 5, 2024, 3:07 PM IST

ABOUT THE AUTHOR

...view details