IND vs ENG Test Series 2024 : విశాఖ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇంగ్లాండ్ జట్టు ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడా ప్రత్యర్థి జట్టు భారత్‌ను వీడి అబుదాబికి బయలు దేరనుంది. రాజ్‌కోట్ వేదికగా జరగబోయే మూడో టెస్టు(Ind Vs Eng 3rd Test) ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభం కానుంది. దీంతో 10 రోజల విరామ సమయం ఇంగ్లాండ్ ప్లేయర్లకు దొరికింది. దీంతో అబుదాబిలో గడపడానికి పర్యటక జట్టు రెడీ అయింది. అక్కడ కొంత విశ్రాంతి తీసుకుని మూడో టెస్టుకు అన్ని విధాల సిద్ధమవుతామని ఆ జట్టు మేనేజ్‌మెంట్ తెలిపింది. కాగా, అబుదాబికి ఇంగ్లాండ్ క్రికెటర్ల ఫ్యామీలీలు కూడా వచ్చినట్లు తెలిసింది. దీంతో అక్కడే ప్రాక్టీస్ చేస్తూ కుటుంబంతో కలిసి గడపనున్నారు ప్రత్యర్థి ఆటగాళ్లు.
ఇకపోతే మొదటి టెస్టులో పరాజయాన్ని అందుకున్న టీమ్ ఇండియా రెండో టెస్టులో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 1-1 తో సమం చేసింది. అసలీ ఈ పర్యటనకు ముందు ఇంగ్లాండ్ జట్టు భారత స్పిన్నర్లను ఎదుర్కోవడానికి అబుదాబి క్యాంప్‌లో గట్టిగానే ప్రాక్టీస్ చేసింది. అయితే మొదటి టెస్టులో విజయం సాధించినప్పటికీ రెండో మ్యాచ్‌లో మాత్రం 106 పరుగుల భారీ తేడాతో ఓటమిని ఖాతాలో వేసుకుంది. ఈ రెండో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో బుమ్రా (Ind Vs Eng Bumrah 6 Wickets) తన రివర్స్ స్వింగ్ బంతులతో 6 వికెట్లు పడగొట్టాడు. దీంతో భారత్‌కు ఆధిక్యం పెరిగింది. అలాగే గిల్ కూడా అద్భుత సెంచరీతో మెరిశాడు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో 399 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ప్రత్యర్థి జట్టు 292 పరుగులకు కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ బౌలర్లు అశ్విన్ (3/72), బుమ్రా (3/46), ముఖేశ్(1/26), కుల్దీప్ యాదవ్(1/60), అక్షర్ పటేల్(1/75) ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. మ్యాచ్‌లో 9 వికెట్లు పడగొట్టిన బుమ్రాకు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది.