IND VS ENG Fourth Test Second Innings Dhruv Jurel : ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 307 పరుగులకు ఆలౌట్ అయింది. ప్రత్యర్థి స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కోలేక కష్టాల్లో పడిన రోహిత్ సేన 219/7తో మూడో రోజు ఆటను మొదలుపెట్టింది. మరో 88 పరుగులు మాత్రమే నమోదు చేసి మిగతా వికెట్లను వరుసగా కోల్పోయింది. ధ్రువ్ జురెల్(90) ఒక్కడే చివరి వరకూ పోరాడి శతకానికి చేరువలో హార్ట్‌లీ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అతడు 149 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 90 పరుగులు చేశాడు. యశస్వి జైస్వాల్ (73) 117 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 73 పరుగులు సాధించి మరోసారి ఆకట్టుకున్నాడు. గిల్ 65 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 38, కుల్దీప్ యాదవ్ 131 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 28 పరుగులు చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ(9 బంతుల్లో 2), రజత్ పాటిదర్(42 బంతుల్లో 17), జడేజా(12 బంతుల్లో 12) విఫలమయ్యారు.
ఇంగ్లాండ్ బౌలర్లలో బషీర్ 5 వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టాడు. అతడు జైశ్వాల్, గిల్, రజత్ పాటిదర్, జడేజా, ఆకాశ్ దీప్ వికెట్లను దక్కించుకున్నాడదు. ఇక హార్ట్‌లీ 3, అండర్సన్ 2 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ జట్టు 353 పరుగులకు ఆల్ ఔట్ అయిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ బ్యాటర్లలో వెటరన్ ప్లేయర్ జో రూట్( 274 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 122) అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. జాక్ క్రాలీ(42 బంతుల్లో 6 ఫోర్లు ఒక సిక్స్ సాయంతో 42), బెయిర్ స్టో(35 బంతుల్లో 4 ఫోర్లు ఒక సిక్స్ సాయంతో 38), ఫోక్స్(126 బంతుల్లో 4 పోర్లు, ఒక సిక్స్ సాయంతో 47) పరుగులతో రాణించారు. టీమ్ ఇండియా బౌలర్లలో రవీంద్ర జడేజా 4 వికెట్లతో సత్తాచాటాడు. ఆకాష్ దీప్ 3 వికెట్లు, సిరాజ్ రెండు, అశ్విన్ ఒక్క వికెట్ దక్కించుకున్నారు.