తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆఖరి టెస్టు భారత్​దే- బజ్​బాల్​ను పిండేసిన రోహిత్ సేన, 4-1తో సిరీస్ కైవసం - Ind vs Eng 5th Test 2024

Ind vs Eng 5th Test 2024: ధర్మశాల టెస్టులో ఇంగ్లాండ్​పై భారత్ గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. 5టెస్టుల సిరీస్​లో భాగంగా జరిగిన ఆఖరి మ్యాచ్​లో భారత్ 64 పరుగులు, ఇన్నింగ్స్​ తేడాతో నెగ్గింది. దీంతో ఐదు మ్యాచ్​ల టెస్టు సిరీస్​ను టీమ్ఇండియా 4-1తో కైవసం చేసుకుంది.

Ind vs Eng 5th Test 2024
Ind vs Eng 5th Test 2024

By ETV Bharat Telugu Team

Published : Mar 9, 2024, 2:02 PM IST

Updated : Mar 9, 2024, 3:30 PM IST

Ind vs Eng 5th Test 2024: ఇంగ్లాండ్​తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్​లో భారత్ ఆఖరి మ్యాచ్​లోనూ విజయం సాధించింది. ధర్మశాల వేదికగా జరిగిన ఐదో టెస్టులో భారత్ 64 పరుగులు, ఇన్నింగ్స్​ తేడాతో నెగ్గింది. భారత్ ఆల్​రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టడం వల్ల మూడో రోజే మ్యాచ్ ముగిసింది. రెండో ఇన్నింగ్స్​లో ఇంగ్లాండ్ 195 పరుగులకే చేతులెత్తేసింది. జో రూట్ (84) హాఫ్ సెంచరీతో రాణించాడు. మిగతా బ్యాటర్లవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. టీమ్ఇండియా బౌలర్లలో అశ్విన్ 5, కుల్​దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా చెరో 2, రవీంద్ర జడేజా 1 వికెట్ దక్కించుకున్నారు. కుల్​దీప్ యాదవ్​కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఆవార్డు', యశస్వీ జైస్వాల్​కు 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' అవార్డు దక్కాయి.

ఇక టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్​లో 218 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ జాక్ క్రాలీ (79 పరుగులు) తప్ప మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేశారు. బెన్ డకెట్ (27), ఓలీ పోప్ (11), జో రూట్ (26), బెయిర్ స్టో (29), స్టోక్స్ (0), ఫోక్స్ (24) భారీ స్కోర్లు చేయడంలో విఫలమయ్యారు. భారత్ బౌలర్లలో కుల్​దీప్ యాదవ్ 5, అశ్విన్ 4, రవీంద్ర జడేజా 1 వికెట్ దక్కించుకున్నారు.

అనంతరం బ్యాటింగ్​కు దిగిన భారత్ తొలి ఇన్నింగ్స్​లో 477 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (103 పరుగులు), యంగ్ బ్యాటర్ శుభ్​మన్ గిల్ (110 పరుగులు) సెంచరీలతో అదరగొట్టాగా, కుర్రాళ్లు యశస్వీ జైస్వాల్ (57), సర్ఫరాజ్ ఖాన్ (56), దేవదత్ పడిక్కల్ (65) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 5, జేమ్స్ అండర్సన్, టామ్​ హార్ట్లీ తలో 2, బెన్ స్టోక్స్ 1 వికెట్ దక్కించుకున్నారు. దీంతో తొలి ఇన్నింగ్స్​లోనే టీమ్ఇండియాకు 259 పరుగుల ఆధిక్యం లభించింది.

స్కోర్లు ఇలా

  • ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్- 218/10
  • భారత్ తొలి ఇన్నింగ్స్- 477/10
  • ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్- 195/10

సర్ఫరాజ్​పై మాజీ బ్యాటర్ ఫైర్ ​- 'ఆ చెత్త షాట్‌ ఇప్పుడు అవసరమా?'

చెలరేగిన రోహిత్ సేన - 255 పరుగుల ఆధిక్యంలో టీమ్​ఇండియా

Last Updated : Mar 9, 2024, 3:30 PM IST

ABOUT THE AUTHOR

...view details