తెలంగాణ

telangana

ETV Bharat / sports

బంగ్లాతో రెండో టెస్టు - మూడో స్పిన్నర్‌ అతడేనా? - IND VS BAN Second Test Spinners - IND VS BAN SECOND TEST SPINNERS

IND VS BAN Second Test Third Spinner : బంగ్లాతో జరగబోయే రెండో టెస్ట్​కు టీమ్​ ఇండియా ఒక పేసర్​ను తగ్గించి ఎప్పటి లాగే ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలో దిగనుందని తెలుస్తోంది. పూర్తి వివరాలు స్టోరీలో.

source Associated Press
IND VS BAN Second Test (source Associated Press)

By ETV Bharat Sports Team

Published : Sep 26, 2024, 8:14 AM IST

IND VS BAN Second Test Third Spinner : బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమ్​ ఇండియా మొదట్లో కష్టపడినా ఆ తర్వాత అలవోకగానే చేజిక్కించుకుంది. సంప్రదాయంగా స్పిన్నర్ల ఆధిపత్యం చెలాయించే చెపాక్‌ పిచ్‌, ఈసారి పేసర్లకు అనుకూలించినప్పటికీ పరిస్థితులను తమకు తగ్గట్లు మార్చుకున్న భారత జట్టు ప్రత్యర్థి జట్టును ఓడించింది. ఇక ఇప్పుడు కాన్పూర్‌ వేదికగా జరగనున్న రెండో టెస్ట్​ కోసం సిద్ధమవుతోంది. ఇందులోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలని పట్టుదలతో ఉంది.

అయితే చెపాక్‌ పిచ్‌ను అంచనా వేసి ఒక స్పిన్నర్‌ లేకుండా మూడో పేసర్‌తో బరిలోకి దిగిన భారత్‌ మంచి ఫలితాన్ని అందుకుంది. కానీ కాన్పూర్‌ పిచ్​లో మార్పులు ఉండే అవకాశాలు లేవు. కాబట్టి ఎప్పటిలాగానే స్పిన్నర్లకు సహకారం ఉంటుంది. దీంతో ఒక పేసర్‌ను తగ్గించి ఎప్పటి లాగే ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్ల కూర్పుతో భారత్‌ బరిలోకి దిగుతుంది.

Kuldeep Yadav Recent Test Stats : మరి రవిచంద్రన్‌ అశ్విన్, రవీంద్ర జడేజాలకు తోడుగా మూడో స్పిన్నర్‌గా ఎవరిని బరిలోకి దింపుతుందని ఇక్కడ ఆసక్తికరంగా మారింది. ఈ స్థానానికి అక్షర్‌ పటేల్, కుల్‌దీప్‌ యాదవ్‌ పోటీ పడుతున్నారు. ఈ మధ్య కాలంలో ఫామ్‌ ప్రకారం చూస్తే కుల్‌దీప్‌కు ఛాన్స్ దక్కాలి. ఎందుకంటే సంవత్సరం నుంచి వివిధ ఫార్మాట్లలో నిలకడగా ఆడుతున్నాడు కుల్‌దీప్‌. ఈ ఏడాది ఆరంభంలోనూ ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగు టెస్టు మ్యాచుల సిరీస్‌లో 20.15 సగటుతో 19 వికెట్లు తీశాడు. ఎలాంటి పిచ్‌ మీదైనా బంతిని బాగా తిప్పేయగలడు. స్పిన్‌కు సహకరిస్తే మరింతగా చెలరేగి ఆడుతాడు.

Axar Patel Recent Test Statsఅయితే కుల్‌దీప్‌ ఓ మోస్తరుగా మాత్రమే బ్యాటింగ్‌ చేయగలడు. ఇతడితో పోలిస్తే అక్షర్‌ బ్యాటింగ్‌లో మరింత మెరుగ్గా ఆడతాడు. కానీ ఎలాగో భారత్‌కు బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉంది కాబట్టి అక్షర్‌ మీద ఆధార పడాల్సిన అవసరం ఉండదు. పైగా కాన్పూర్‌ వికెట్​ బ్యాటింగ్‌కు అనుకూలమే. అక్షర్‌ లాగే లెఫ్ట్ హ్యాండ్​తో బౌలింగ్‌ చేసే జడేజా జట్టులో ఉన్నాడు కాబట్టి అలాంటి బౌలర్‌ మరొకరిని తుది జట్టులోకి తీసుకోవడం కష్టమే అని చెప్పాలి. ఎందుకంటే అలా చేస్తే బౌలింగ్‌లో వైవిధ్యం కనపడదు. టెస్టుల్లో అక్షర్‌ ఫామ్‌ కూడా ఈ మధ్య అంత గొప్పగా ఏమీ లేదు. చివరగా అతడు ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు ఆడి 5 వికెట్లు మాత్రమే తీశాడు.

కాబట్టి ప్రస్తుతం జరగబోయే రెండో టెస్​కు కుల్‌దీప్‌కే జట్టు యాజమాన్యం మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు బంగ్లాదేశ్‌ పేసర్‌ నహిద్‌ రాణా స్థానంలోకి తైజుల్‌ ఇస్లామ్‌ను ఎంపిక చేస్తుందని సమాచారం.

మెగా వేలంలోకి 5 స్టార్‌ ప్లేయర్స్!​ - ఏ ఫ్రాంఛైజీ ఎవరిని వదులుకుంటుందంటే? - IPL 2025 Mega Auction

498 పరుగులతో విధ్వంసం - 86 ఫోర్లు, 7 సిక్సర్లు- యువక్రికెటర్ ధనాధన్ ఇన్నింగ్స్ - 498 Runs In An Innings

ABOUT THE AUTHOR

...view details