IND VS BAN Second Test : భారత్ - బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్ట్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా టాస్ గెలిచిన భారత జట్టు ఫీల్డింగ్‌కు దిగింది. బంగ్లాదేశ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఇప్పటికే రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఒక టెస్టు గెలిచిన భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.
అయితే కాన్పూర్ పిచ్ స్పిన్‌కు అనుకూలమని వార్తలు వచ్చాయి. దీంతో తుది జట్టులో మార్పులు జరుగుతాయని అంతా అనుకున్నారు. ముగ్గురు పేసర్లకు బదులు ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతుందని, కుల్దీప్ - అక్షర్‌లో ఒకరికి ఛాన్స్ దక్కుతుందని భావించారు. కానీ కెప్టెన్ రోహిత్ శర్మ అలా చేయలేదు. చెపాక్ టెస్టులో ఆడిన ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్ల కాంబినేషన్‌లోనే కాన్పూర్ టెస్టుకు సిద్ధమయ్యాడు. స్పిన్ ఛాలెంజ్‌ను స్వీకరించాడు! దీంతో తుది జట్టులో ఎలాంటి మార్పులు జరగలేదు.
బంగ్లాదేశ్ జట్టు మాత్రం రెండు మార్పులు చేసింది. నహీద్, తస్కిన్ స్థానంలో తైజుల్, ఖలీద్‌ను తీసుకున్నాడు కెప్టెన్ శాంటో.
జట్లు :
టీమ్ ఇండియా - రోహిత్, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, కోహ్లి, పంత్, కేఎల్ రాహుల్, జడేజా, అశ్విన్, ఆకాశ్ దీప్, బుమ్రా, సిరాజ్.
బంగ్లాదేశ్ - షద్మాన్, జాకీర్ హసన్, నజ్ముల్ శాంటో, మొమినుల్ హక్, ముష్ఫికర్, షకిబ్, లిటన్ దాస్, మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్, హసన్ మహమూద్, ఖలీద్ అహ్మద్.
Kanpur Green Park Stadium Record : కాగా, కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో 1952 నుంచి టెస్టు మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 23 టెస్టు మ్యాచులు జరిగాయి. అందులో భారత్ 7 విజయం సాధించగా 3 సార్లు ఓడిపోయింది. ఇక ఈ కాలంలో దాదాపు 13 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. 2010 తర్వాత న్యూజిలాండ్‌తో రెండు టెస్టులు మాత్రమే ఇక్కడ ఆడింది. 2016లో భారత్ విజయం సాధించగా, 2021లో న్యూజిలాండ్ మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. ఇకపోతే బంగ్లాదేశ్‌తో అయితే మొత్తం ఇప్పటివరకు 13 మ్యాచులు ఆడి, 11 విజయాలను నమోదు చేసింది భారత్. రెండు సార్లు డ్రా చేసుకుంది.
'అతడి భద్రత మాకు సంబంధించినది కాదు' - షకిబ్‌కు షాకిచ్చిన బీసీబీ - BCB ON SHAKIB AL HASAN SECURITY
క్లీన్‌స్వీప్ లక్ష్యంగా - రెండో టెస్ట్‌కు సిద్ధమైన భారత్! - IND VS BAN Second Test