IND vs BAN First Test : బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ ఇండియా 376 పరుగులకు ఆలౌట్ అయింది. ఓవర్‌నైట్ 339/6తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత జట్టు మరో 37 పరుగులు మాత్రమే చేసి మిగతా నాలుగు వికెట్లను చేజార్చుకుంది. రవిచంద్రన్ అశ్విన్ (113), రవీంద్ర జడేజా (86), యశస్వి జైస్వాల్ (56), రిషభ్ పంత్ (39)తో అద్భుతంగా రాణించారు. బంగ్లా బౌలర్ హసన్ మహ్మద్ 5 వికెట్లు తీసి భారత్‌పై గట్టి ప్రభావం చూపాడు. తస్కిన్ 3, మెహిదీ, నహిద్ తలో వికెట్ తీశారు.
ఈ మ్యాచ్‌కు సంబంధించి మరికొన్ని రికార్డులు
- ఈ మ్యాచ్‌లో బంగ్లా పేసర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. అయితే ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ పేసర్లు అత్యధిక వికెట్లు వికెట్లు పడగొట్టిన మ్యాచుల్లో ఇది ఐదో మ్యాచ్ కావడం విశేషం. ఈ ఏడాదిలోనే రావల్పిండిలో పాకిస్థాన్‌పై 10 వికెట్లు పడగొట్టిన బంగ్లా పేసర్లు, ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్‌లో 9 వికెట్లు తీశారు.
- ఈ మ్యాచ్‌లో 144/6 స్కోరు చేసిన భారత్ ఆ తర్వాత స్పీడ్ పెంచి 376/10కి చేరింది. అంటే చివరి నాలుగు వికెట్లలో 232 పరుగులను చేశారు భారత బ్యాటర్లు. అంటే ఆరు లేదా అంతకన్నా తక్కువ(150 కంటే తక్కువ స్కోరుకే) వికెట్లను కోల్పోయిన తర్వాత ఎక్కువ పరుగులు సాధించిన రెండో మ్యాచ్ ఇదే.
- టెస్టు మ్యాచుల్లో టీమ్ ఇండియాపై ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన ఐదో బౌలర్ హసన్. అతడు 5/83 చేశాడు. అంతకుముందు నైముర్ రహ్మాన్, షకిబ్ అల్ హసన్, మెహిదీ హసన్, షహదాత్ ఈ మార్క్‌ను టచ్ చేశారు. కానీ, భారత వేదికపై మాత్రం హసనే మొదటి బౌలర్ కావడం విశేషం.
- ఈ మ్యాచ్‌లో అశ్విన్ - రవీంద్ర జడేజా అద్భుతంగా రాణించి టీమ్ ఇండియా స్కోరును పరుగులు పెట్టించారు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 199 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. బంగ్లాదేశ్‌పై ఏ వికెట్‌కైనా ఇది ఐదో అత్యధిక పార్టనర్‌షిప్. 2015లో శిఖర్ ధావన్ - మురళీ విజయ్ 283 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.