తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఫామ్‌ సూపర్‌, జట్టులో బోలెడు మ్యాచ్‌ విన్నర్లు - ఆసీస్​ జట్టు బలాబలాలు ఇవే! - BORDER GAVASKAR TROPHY

మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్న బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీ - ఆస్ట్రేలియా బలాబలాలు ఇవే!

IND VS AUS Border Gavaskar Trophy
IND VS AUS Border Gavaskar Trophy (source Associated Press)

By ETV Bharat Sports Team

Published : Nov 18, 2024, 9:56 AM IST

IND VS AUS Border Gavaskar Trophy :"ప్రస్తుతం మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్న బోర్డర్ గావస్కర్​ ట్రోఫీ సిరీస్‌ ముంగిట టీమ్ ఇండియా అంత పటిష్టంగా లేదు. తీవ్ర ఒత్తిడి, విమర్శలను ఎదుర్కొంటోంది. సొంతగడ్డపై కివీస్​ చేతిలో వైట్‌వాష్‌కు గురి కావడమే ప్రధాన కారణం. రోహిత్, కోహ్లి, రాహుల్‌ లాంటి సీనియర్లు ఫామ్‌లో లేకపోవడంతో పాటు షమి కూడా అందుబాటులో లేడు. కాబట్టి భారత్​ వరల్డ్​ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ చేరాలంటే 4-0తో సిరీస్‌ గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది జరగాలంటే భారత బ్యాటర్లు అసాధారణ ప్రదర్శన చేయాల్సిందే. కానీ ప్రత్యర్థి జట్టు గత రెండు సీజన్​లలో లాగా అంత తేలిగ్గా లొంగేలా కనిపించడం లేదు.

బోలెడు మ్యాచ్‌ విన్నర్లు - ఆస్ట్రేలియా జట్టులో మ్యాచ్‌ విన్నర్లు చాలా మందే ఉన్నారు. అందరి కన్నా స్టీవ్‌ స్మిత్‌తో టీమ్ ఇండియాకు ఎక్కువ ప్రమాదం పొంచి ఉంది. ఆ మధ్యలో బాల్‌ టాంపరింగ్‌ వివాదం వల్ల ఓ రెండేళ్లు స్మిత్‌ ఇబ్బంది పడ్డాడు. అయితే అంతకుముందు స్టీవ్​ స్మిత్​ ఎలా పరుగుల వరద పారించాడో తెలిసిన విషయమే. పైగా భారత జట్టు అంటే అతడికి ప్రియమైన ప్రత్యర్థి అనే చెప్పాలి.

2014లో ఏకంగా నాలుగు సెంచరీలతో చెలరేగి ఆడిన స్టీవ్ స్మిత్, గత రెండు సిరీస్‌ల్లో మాత్రం మోస్తరు ప్రదర్శన మాత్రమే. గతేడాది ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లోనూ (WTC) టీమ్‌ఇండియాపై శతకం బాది జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ట్రావిస్‌ హెడ్‌, నిరుడు డబ్ల్యూటీసీ ఫైనల్​తో పాటు వన్డే ప్రపంచకప్‌ తుది పోరులో భారత్‌ను దెబ్బ కొట్టిన తీరును ఎవరూ మరిచిపోలేరేమో.

ఓపెనింగ్‌లో ఉస్మాన్‌ ఖవాజా, మూడో స్థానంలో లబుషేన్‌ వంటి మెరుగైన బ్యాటర్లు ఉన్నారు. మిడిల్ ఆర్డర్​లో హెడ్, కేరీ కీలక పాత్ర పోషించే సత్తా ఉంది.

బౌలింగ్‌లో ఆసీస్‌ బలంగా ఉంది. కెప్టెన్‌ కమిన్స్​తో పాటు స్టార్క్, హేజిల్‌వుడ్‌లను ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. మరో పేసర్‌ బోలాండ్‌ కూడా మంచి ఊపు మీదే కనిపిస్తున్నాడు.

ఆస్ట్రేలియా తమ తుది జట్టులో ఒకే స్పిన్నర్‌కు ఛాన్స్ ఇస్తుంది కానీ, ఆ ఒక్కడు అదిరే ప్రదర్శన చేస్తాడు. లైయన్‌ ఎలాంటి పిచ్​పై అయినా టర్న్‌ చేసి వికెట్లు పడగొట్టగలడు.

లోయరార్డర్​లో ఆడే కమిన్స్, స్టార్క్‌ బ్యాటింగ్‌లోనూ మంచి ప్రదర్శన చేయగలరు. ఇంకా చెప్పాలంటే ఆస్ట్రేలియాకు సిరీస్‌లో ఏకైక సమస్య, ఖవాజాకు సరైన ఓపెనింగ్‌ భాగస్వామి ఉండకపోవడమే. వార్నర్‌ రిటైర్ అయ్యాక స్మిత్‌ను ఆ స్థానంలో ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఇకపోతే కొత్త ప్లేయర్​ మెక్‌స్వీనీకి అవకాశమిచ్చారు. అతనెలా రాణిస్తాడో చూడాలి మరి.

ఫామ్‌ సూపర్‌ :టెస్టుల్లో ఆస్ట్రేలియా మంచి ఫామ్‌ కనబరుస్తోంది. తన చివరి మూడు టెస్టు సిరీస్‌లను సొంత గడ్డ పైనే ఆడింది. వెస్టిండీస్‌తో సిరీస్‌ 1-1తో సమం అవ్వగా, అంతకుముందు న్యూజిలాండ్, పాకిస్థాన్‌లపై సిరీస్‌లను క్లీన్‌స్వీప్‌ చేసింది. అంత కన్నా ముందు ఇంగ్లాండ్‌లో యాషెస్‌ సిరీస్‌ను 2-2తో సమం చేసింది. అయితే ఫిబ్రవరిలో వెస్టిండీస్‌తో సిరీస్‌ బరిలోకి అయ్యాక ఆస్ట్రేలియా జట్టు టెస్టులే ఆడలేదు. అంటే ఏకంగా తొమ్మిది నెలల విరామం తర్వాత, టీమ్ ఇండియాతో కీలక సిరీస్‌కు రెడీ అయిందనమాట. ఆ జట్టు ప్లేయర్స్​ ఇతర ఫార్మాట్లలోనూ రాణిస్తూ మంచి ఫామ్​లోనే ఉన్నారు.

ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు రోహిత్ శర్మ దూరం! - కెప్టెన్ ఎవరంటే?

ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్- రాహుల్ ఈజ్ బ్యాక్- తొలి టెస్టుకు రెడీ!

ABOUT THE AUTHOR

...view details