Ind vs Aus 5th Test :2024 బోర్డర్- గావస్కర్ ట్రోఫీ చివరి దశకు చేరుకుంది. ఈ సిరీస్‌లో ఆఖరిదైన ఐదో టెస్టు శుక్రవారం ప్రారంభం కానుంది. సిడ్నీ గ్రౌండ్ ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. ఆతిథ్య ఆస్ట్రేలియా 1-2తో ఇప్పటికే సిరీస్‌లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు టీమ్ఇండియా చివరి మ్యాచ్‌లోనైనా నెగ్గి 2- 2తో సిరీస్‌ను డ్రా చేసుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో తుది జట్టు విషయంలో మేనేజ్మెంట్ కఠిన నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది.
రోహిత్ దూరం!
పేలవమైన ఫామ్‌తో సతమతమౌతున్న టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టు కెరీర్ క్లైమాక్స్‌కు చేరినట్లే కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ ఆడేది అనుమానంగా మారింది. పేలవమైన ఫామ్ కారణంగా రోహిత్ శర్మ చివరి టెస్టు నుంచి తప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు బ్యాటర్‌గా, ఇటు కెప్టెన్‌గా రోహిత్ విఫలమవుతుండటమే అందుకు కారణం.
విరాట్ కోహ్లీ, శుభమన్ గిల్, KL రాహుల్, యశస్వీ జైశ్వాల్ నెట్స్‌లో ముమ్మర సాధన చేయగా ప్రాక్టీస్‌కు రోహిత్ చాలా ఆలస్యంగా రావడం గమనార్హం. అయితే శుక్రవారం ఉదయం పిచ్‌ను పరిశీలించాకే తుదిజట్టుపై నిర్ణయం తీసుకుంటామని టీమ్ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్ ప్రకటించారు. రోహిత్ ఆడతాడా లేడా అనేదానిపై గంభీర్ సూటిగా సమాధానం ఇవ్వలేదు. ఒక వేళ సిడ్నీ టెస్టులో రోహిత్ ఆడకపోతే పేలవమైన ఫామ్ కారణంగా తుదిజట్టులో చోటు కోల్పోయిన తొలి భారత కెప్టెన్ రోహితే అవుతాడు.
ఆస్ట్రేలియాతో సిరీస్‌లో 5 ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ కేవలం 31 పరుగులే చేశాడు. మహేంద్ర సింగ్ ధోనీ, అనిల్ కుంబ్లే కూడా టెస్టు సిరీస్‌ల మధ్యలోనే రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చింది. ఇప్పటికే రవిచంద్రన్ అశ్విన్ సిరీస్ మధ్యలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఒకవేళ రోహిత్ సిడ్నీ టెస్టులో ఆడకపోతే మెల్‌బోర్న్‌లో ఆసీస్‌తో జరిగిన నాలుగో టెస్టు మ్యాచే రోహిత్ కెరీర్‌లో ఆఖరి టెస్టు కానుంది.