ICC Test Team Rankings : ఇటీవలే జరిగిన బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో ఆతిథ్య ఆస్ట్రేలియా చేతిలో 1-3 తేడాతో ఓటమి పాలైన టీమ్ ఇండియా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్సలో 3వ స్థానానికి దిగజారింది. ఈ క్రమంలో 9 ఏళ్ల తర్వాత ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్-2 నుంచి భారత్ నిష్క్రమించి మూడో స్థానానికి పరిమితమైంది. అయితే ఆడిన చివరి 8 టెస్టు మ్యాచ్‌ల్లో భారత్ ఏకంగా ఆరింటిలో ఓటమి పాలవ్వడం వల్ల డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకోలేకపోయింది.
సెకండ్ ప్లేస్‌లో సౌతాఫ్రికా
ఇదిలా ఉండగా, సౌతాఫ్రికా జట్టు వరుసగా ఏడు టెస్టు మ్యాచ్ విజయాలు సాధించడం వల్ల ఆ జట్టు ర్యాంక్ మెరుగుపడడానికి దోహదపడింది. తాజాగా పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో దక్షిణాఫ్రికా 2-0తో గెలవడం వల్ల ఆ జట్టు రెండో స్థానానికి చేరుకుంది. 112 రేటింగ్ పాయింట్లతో సౌతాఫ్రికా ఇప్పుడు భారత్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానానికి చేరుకుంది.
తొలి స్థానంలో ఎవరంటే?ఎ
126 రేటింగ్ పాయింట్లతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో నిలిచింది. 112 రేటింగ్ పాయింట్లతో సౌతాఫ్రికా రెండో స్థానంలో ఉంది. 2016 తర్వాత తొలిసారిగా 109 రేటింగ్ పాయింట్లతో టెస్టు టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ మూడో స్థానానికి దిగజారింది. 106 పాయింట్లతో ఇంగ్లాండ్ నాలుగో స్థానంలో, 96 పాయింట్లతో న్యూజిలాండ్ ఐదో స్థానంలో కొనసాగుతున్నాయి. 87 పాయింట్లతో శ్రీలంక ఆరో స్థానంలో ఉంది. పాకిస్థాన్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, ఐర్లాండ్ ఆ తర్వాతి వరుస స్థానాల్లో నిలిచాయి.
డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టాప్ లో ఆసీస్
పాకిస్థాన్‌తో జరిగిన కేప్‌టౌన్ టెస్టులో అద్భుత విజయం సాధించింది సఫారీ జట్టు. దీంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా దూసుకొచ్చింది. డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్లో దక్షిణాఫ్రికా 69.44 శాతం పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఆసీస్-శ్రీలంక మధ్య జరగనున్న టెస్టు సిరీస్ ఫలితం తర్వాత డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంపై క్లారిటీ వస్తుంది.