తెలంగాణ

telangana

విరాట్, యశస్వి ముందుకు- బాబర్ ర్యాంక్ ఢమాల్ - ICC Rankings

By ETV Bharat Sports Team

Published : Aug 28, 2024, 3:54 PM IST

ICC Rankings 2024: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) లేటెస్ట్ టెస్టు ర్యాంకింగ్స్​ బుధవారం రిలీజ్ చేసింది. ఈ ర్యాంకింగ్స్​లో టీమ్ఇండియా బ్యాటర్ల స్థానాలు మెరుగుపడగా, పాక్ ప్లేయర్ బాబర్ ఏకంగా ఆరు స్థానాలు కోల్పోయాడు.

ICC Rankings
ICC Rankings (Source: Getty Images)

ICC Rankings 2024:అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) లేటెస్ట్​గా టెస్టు ర్యాంకింగ్స్​ రిలీజ్ చేసింది. బుధవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్​లో టీమ్ఇండియా బ్యాటర్లు విరాట్ కోహ్లీ 2 స్థానాలు, యశస్వీ జైశ్వాల్ 1 ప్లేస్ మెరుగుపర్చుకున్నారు. ప్రస్తుతం జైశ్వాల్ (740 రేటింగ్స్) 7న స్థానం దక్కించుకోగా, విరాట్ (737 రేటింగ్స్​) 8వ ప్లేస్​లో కొనసాగుతున్నాడు. కాగా, కెప్టెన్ రోహిత్ శర్మ 751 రేటింగ్స్​తో 6వ స్థానంలో ఉన్నాడు.

అయితే పాక్ బ్యాటర్, లిమిటెడ్ ఓవర్ల కెప్టెన్ బాబర్ ఆజమ్​ ఏకంగా 6స్థానాలు కోల్పోయాడు. బాబర్ ప్రస్తుతం 734 రేటింగ్స్​తో 9వ ర్యాంక్​కు పడిపోయాడు. మరోవైపు పాకిస్థాన్ మరో బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ 7స్థానాలు మెరుగు పర్చుకున్నాడు. రిజ్వాన్ 728 రేటింగ్స్​తో 10వ ర్యాంక్​లో కొనసాగుతున్నాడు. ఇక ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ (881 రేటింగ్స్) టాప్​ ప్లేస్​ నిలబెట్టుకున్నాడు. తర్వాత న్యూజిలాండ్‌ ఆటగాళ్లు కేన్ విలియమ్సన్ (859 రేటింగ్స్), డారిల్ మిచెల్ (768 రేటింగ్స్) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.

టాప్ 5 బ్యాటర్లు

1 జో రూట్ ఇంగ్లాండ్ 881 రేటింగ్స్
2 కేన్ విలియమ్సన్ న్యూజిలాండ్‌ 859 రేటింగ్స్
3 డారిల్ మిచెల్ న్యూజిలాండ్‌ 768 రేటింగ్స్
4 హ్యారీ బ్రూక్ ఇంగ్లాండ్ 758 రేటింగ్స్​
5 స్టీవ్ స్మిత్ ఆస్ట్రేలియా 757 రేటింగ్స్

టాప్ 5 బ్యాటర్లు
ICC Test Bowling Ranking: మరోవైపు బౌలింగ్ ర్యాంకింగ్స్​లో టీమ్ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (870 రేటింగ్స్​) టాప్​ ప్లేస్​లో కొనసాగుతుండగా, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (847 రేటింగ్స్​), ఆస్ట్రేలియా ప్లేయర్ జోష్ హేజిల్​వుడ్ (847 రేటింగ్స్​)తో కలిసి రెండో స్థానం పంచుకున్నాడు. ఇక టీమ్ఇండియా నుంచి మరో స్పిన్నర్ రవీంద్ర జడేజా (788 రేటింగ్స్) 7వ స్థానం నిలబెట్టుకున్నాడు. దీంతో ముగ్గురు టీమ్ఇండియా ప్లేయర్లు టాప్- 10లో ఉన్నారు.

టాప్ - 5 బౌలర్లు

1 రవిచంద్రన్ అశ్విన్ భారత్​ 870 రేటింగ్స్
2 జస్ప్రీత్ బుమ్రా భారత్​ 847 రేటింగ్స్
. జోష్ హేజిల్​వుడ్ ఆస్ట్రేలియా 847 రేటింగ్స్
4 ప్యాట్ కమిన్స్​ ఆస్ట్రేలియా 820 రేటింగ్స్​
. కగిసో రబాడా సౌతాఫ్రికా 820 రేటింగ్స్​

ఇక టెస్టు ఫార్మట్ టీమ్ ర్యాంకింగ్స్​లో ఆస్ట్రేలియా అగ్రస్థానం నిలబెట్టుకుంది. 124 రేటింగ్స్​తో ఆసీస్ టాప్​లో ఉండగా, భారత్ (120 రేటింగ్స్) రెండో స్థానంలో కొనసాగుతోంది. తర్వాత ఇంగ్లాండ్ (108 రేటింగ్స్), సౌతాఫ్రికా (104 రేటింగ్స్), న్యూజిలాండ్ (96 రేటింగ్స్) వరుసగా స్థానాల్లో ఉన్నాయి.

ICC ర్యాంకింగ్స్: సత్తాచాటిన రోహిత్, గిల్, విరాట్- టాప్ 5లో ముగ్గురు మనోళ్లే - ICC Ranking

టెస్టు ర్యాంకింగ్స్ రిలీజ్- అగ్రస్థానానికి చేరువలో రూట్- మరి రోహిత్, విరాట్ ప్లేస్? - ICC Test Ranking 2024

ABOUT THE AUTHOR

...view details