తెలంగాణ

telangana

ETV Bharat / sports

ICC ర్యాంకింగ్స్: సత్తాచాటిన రోహిత్, గిల్, విరాట్- టాప్ 5లో ముగ్గురు మనోళ్లే - ICC Ranking - ICC RANKING

ICC Ranking ODI: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బుధవారం లేటెస్ట్ వన్డే ర్యాంకింగ్స్ రిలీజ్ చేసింది. ఈ ర్యాంకింగ్స్​లో టాప్- 5లో ముగ్గురు టీమ్ఇండియా బ్యాటర్లే ఉండడం విశేషం.

ODI RANKING
ODI RANKING (Source: Associated Press)

By ETV Bharat Sports Team

Published : Aug 7, 2024, 8:36 PM IST

ICC Ranking ODI:అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బుధవారం విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్​లో టీమ్ఇండియా బ్యాటర్లు సత్తా చాటారు. టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ శుభ్​మన్ గిల్ 782 రేటింగ్స్​తో రెండో స్థానంలో కొనసాగుతుండగా, కెప్టెన్ రోహిత్ శర్మ ఒక స్థానం మెరుగుపర్చుకొని మూడో ప్లేస్​కు చేరుకున్నాడు. హిట్​మ్యాన్ ప్రస్తుతం 763 రేటింగ్స్​తో మూడో ప్లేస్​లో ఉండగా, స్టార్ విరాట్ కోహ్లీ 752 రేటింగ్స్​తో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ 824 రేటింగ్స్​తో టాప్ ప్లేస్​లో ఉన్నాడు. అయితే టాప్- 5లో ముగ్గురు టీమ్ఇండియా బ్యాటర్లే ఉండడం విశేషం.

  • టాప్- 5 బ్యాటర్లు
బాబర్ ఆజమ్ పాకిస్థాన్ 824 రేటింగ్స్​
శుభ్​మన్ గిల్ భారత్ 782 రేటింగ్స్​
రోహిత్ శర్మ భారత్ 763 రేటింగ్స్​
విరాట్ కోహ్లీ భారత్ 752 రేటింగ్స్
హ్యారీ టెక్టర్ ఐర్లాండ్ 746 రేటింగ్స్​

కాగా, బౌలింగ్​లో టీమ్ఇండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఏకంగా 5స్థానాలు మెరుగుపర్చుకొని, నాలుగో ప్లేస్​కు ఎగబాకాడు. ప్రస్తుతం కుల్దీప్ 662 రేటింగ్స్​తో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇక పేసర్ మహ్మద్ సిరాజ్ కూడా 662 రేటింగ్స్​తో ఉన్నప్పుటికీ 5వ స్థానంలో కొనసాగుతున్నాడు. స్టార్ పేసర్ జస్ర్పీత్ బుమ్రా మాత్రం 3స్థానాలు కోల్పోయాడు. అతడు 651 రేటింగ్స్​తో 8వ ప్లేస్​లో ఉన్నాడు. వీళ్లు ముగ్గురు టాప్ 10లో ఉండగా, మహ్మద్ షమీ 616 రేటింగ్స్​తో 12వ స్థానం దక్కించుకున్నాడు. ఇక సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతడు 716 రేటింగ్స్​తో టాప్​లో ఉండగా, జోష్ హేజిల్​వుడ్ 688 రేటింగ్స్​లో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

టాప్ 5 బౌలర్లు

  • కేశవ్ మహరాజ్- సౌతాఫ్రికా- 716 రేటింగ్స్​
  • జోష్ హేజిల్​వుడ్- ఆస్ట్రేలియా- 688 రేటింగ్స్
  • ఆడమ్ జంపా- ఆస్ట్రేలియా- 686 రేటింగ్స్
  • కుల్దీప్ యాదవ్- భారత్- 662 రేటింగ్స్
  • మహ్మద్ సిరాజ్- భారత్- 662 రేటింగ్స్

ABOUT THE AUTHOR

...view details