ICC Rankings System:ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రకటించే ర్యాంకులు ప్రస్తుత క్రికెట్ ప్రపచంలో చాలా కీలకం. ఈ ర్యాంకులు మూడు ఫార్మాట్‌లలోని ఆటగాళ్లు, జట్ల ప్రదర్శనను తెలియజేస్తాయి. ఈ ర్యాంకులు ప్రస్తుత ఫామ్, గత ప్రదర్శనలు రెండింటినీ పరిగణించే డీటైల్డ్ సిస్టమ్‌పై ఆధారపడి ఉంటాయి. అయితే ఐసీసీ ర్యాంకులను ఎలా కాలిక్యులేట్ చేస్తుంది? ఏ ఆధారంగా ఆటగాళ్లకు ర్యాంకులు కేటాయిస్తుంది? అని చాలా మందికి సందేహాలు ఉన్నాయి. మరి ఐసీసీ ఈ ర్యాంకింగ్స్‌ను ఎలా కాలిక్యులేట్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం.
ర్యాంకులు ఎలా లెక్కిస్తారు?
ప్లేయర్ ర్యాంకులు:ఐసీసీ ప్రతి ఫార్మాట్‌లో బ్యాటర్లు, బౌలర్లు, ఆల్- రౌండర్లకు విడిగా ర్యాంకులు లెక్కిస్తుంది. టెస్టు, వన్డే, టీ20లకు వేర్వేరుగా ప్రకటిస్తుంది.
- బ్యాటింగ్:బ్యాటర్ స్కోర్ చేసిన ప్రతీ పరుగుకి పాయింట్లు పొందుతారు. హాఫ్ సెంచరీలు, సెంచరీలు కొట్టినందుకు అదనపు పాయింట్లు లభిస్తాయి. మొత్తం పాయింట్లను ఆటగాడు ఆడిన ఇన్నింగ్స్‌ల సంఖ్యతో భాగిస్తారు. ఈ పద్ధతి బ్యాటర్ నిలకడతో కూడిన ప్రదర్శనను సూచిస్తుంది.
- బౌలింగ్: బౌలర్లు వారు తీసే ప్రతీ వికెట్‌కు పాయింట్లు పొందుతారు. మెరుగైన బౌలింగ్ యావరేజ్ ఉన్నవారికి అదనపు పాయింట్లు దక్కుతాయి. మొత్తం పాయింట్లను ఆడిన మ్యాచ్‌ల సంఖ్యతో భాగిస్తారు. బౌలర్ వికెట్లు తీయగల సామర్థ్యం, ఇచ్చిన పరుగుల పరంగా వారి సామర్థ్యం రెండింటినీ పరిగణనలోకి తీసుకుంటుంది.
- ఆల్ రౌండర్లు: ఆల్ రౌండర్లు వారి బ్యాటింగ్, బౌలింగ్ ప్రదర్శనల ఆధారంగా ర్యాంకు పొందుతారు. ఐసీసీ వీరికి ఒక నిర్దిష్ట సూత్రాన్ని ఉపయోగిస్తుంది. అటు బ్యాటు, ఇటు బంతితో అందించిన సహకారాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. గేమ్‌పై వారి మొత్తం ప్రభావం కచ్చితంగా అంచనా వేసి పాయింట్లు కేటాయిస్తుంది.