ICC ODI Rankings :ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో అఫ్గానిస్థాన్ స్టార్ ప్లేయర్ మహమ్మద్ నబీ ఓ అరుదైన రికార్డు సృష్టించాడు. దాదాపు 1,739 రోజుల పాటు టాప్ ర్యాంక్‌లో ఉన్న షకిబ్ అల్ హసన్‌ను వెనక్కినెట్టి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. అలా వన్డే ఫార్మాట్ ఆల్ రౌండర్ల జాబితాలో నెంబర్ వన్‌గా నిలిచాడు. శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో సెంచరీ సాధించిన నబీ, పెద్ద వయసులో అగ్రస్థానం దక్కించుకున్న ప్లేయర్‌గానూ చరిత్రకెక్కాడు. ప్రస్తుతం నబీ వయసు 39 ఏళ్ల 43 రోజులు. అంతకుముందు 2015లో శ్రీ లంక ప్లేయర్ తిలకరత్నె దిల్షాన్ (38 ఏళ్ల 8 నెలలుతో ఈ లిస్ట్‌లో టాప్ పొజిషన్లో ఉన్నారు. అఫ్గాన్ ప్లేయర్లు రషీద్ ఖాన్, ముజీబ్ రహ్మన్ కూడా గతంలో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం సాధించినవారే.
ICC ODI Bowling Rankings : మరోవైపు బౌలర్ల లిస్ట్‌లో సౌతాఫ్రికా ప్లేయర్ కేశవ్ మహరాజ్ 716 పాయింట్లతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇక టీమ్ఇండియా తరఫున స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ (678), స్పిన్నర్ జస్‌ప్రీత్ బుమ్రా (665) నాలుగు, ఐదు స్థానాలు సంపాదించుకున్నారు.
ICC ODI Batting Rankings : ఇక వన్డే బ్యాటర్ల జాబితాలో 824 పాయింట్లతో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజామ్ టాప్ ర్యాంకర్‌గా ఉన్నాడు. ఇక యంగ్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్ (801), రన్నింగ్ మెషిన్ విరాట్ కోహ్లీ (768), కెప్టెన్ రోహిత్ శర్మ (746) వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాలను కైవసం చేసుకున్నారు.