ICC Best Fielder Award :ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా శనివారం భారత్, సౌతాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌లో విజయం రోహిత్ సేననే వరించింది. ఎంతో ఉత్కంఠగా జరిగిన ఈ పోరులో టీమ్ఇండియా ఆఖరి వరకు పోరాడి కప్‌ను ముద్దాడారు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ లాంటి స్టార్స్ తమ సూపర్ పెర్ఫామెన్స్‌తో జట్టును కాపాడారు.
అయితే మ్యాచ్ తర్వాత ఎన్నో మధుర క్షణాలను ఆస్వాదించారు మన ప్లేయర్లు. వారితో పాటు క్రికెట్ అభిమానులుక కూడా ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఇక ఎప్పటిలాగే బెస్ట్ ఫీల్డర్‌ను ఎంచుకునే సమయంలో ఓ ఆసక్తికరమైన ఘటన జరిగింది. అదేంటంటే?
కప్ గెలిచిన తర్వాత ప్లేయర్లందరూ ఉత్సాహంగా డ్రెస్సింగ్ రూమ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. సరిగ్గా అదే సమయంలో బెస్ట్ ఫీల్డర్ మెడల్ సెరీమనీని ప్రారంభించాడు బౌలింగ్ కోచ్ దిలీప్.
"ఈ రోజును మనం జయించాం. టోర్నమెంట్ ఆసాంతం మనం చూపిన తెగువ, పట్టుదల అద్భుతం. ద్రవిడ్, రోహిత్ ప్రతి ఒక్కరికీ తమ పాత్రలేంటో తెలుసు అంటూ ఎప్పుడూ చెబుతూనే ఉన్నారు. కానీ, మనం కలసికట్టుగా వచ్చిన ప్రతి అవకాశాన్నీ ఎంతో చక్కగా వేటాడాం. దేన్నీ వదిలిపెట్టలేదు. ముఖ్యంగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు సూర్యకుమార్ ఈ రోజు పట్టినటువంటి క్యాచ్‌లు ఒక 50 వరకు పట్టి ఉంటాడు. కానీ, ఫీల్డ్‌కు వచ్చే సరికి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడమే ఉంటుంది. బాల్‌ను అంచనా వేయడంతో పాటు బౌండరీని దృష్టిలో ఉంచుకోవాలి. అది ఎంతో క్లిష్టమైన విషయం. పైకి ఎగరేసి తిరిగి క్యాచ్ పట్టగలమన్న విశ్వాసం కూడా మనలో ఉండాలి. ఇవన్నీ క్షణాల్లో చేయాల్సిన విషయాలుయ దాన్ని సూర్య సమర్థంగా చేయగలిగాడు" అంటూ విన్నర్ అయిన సూర్యకుమార్‌ను అనౌన్స్ చేశాడు.
ఇక ఈ సెరీమనీకి అతిథిగా వచ్చిన బీసీసీఐ సెక్రట్రీ జై షా ఆ మెడల్‌ను సూర్యకుమార్‌కు అందజేశారు. దాన్ని తీసుకున్న సూర్యకుమార్ సంతోషం వ్యక్తం చేశాడు. దీంతో డ్రెస్సింగ్ రూమ్‌లో మరోసారి ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది.
ఏకైక ప్లేయర్‌గా రోహిత్ ఘనత- ఏంటో తెలుసా?
1983-2024 ICC ఈవెంట్స్- భారత్ నెగ్గిన ట్రోఫీలెన్ని? కెప్టెన్లు ఎవరు? - T20 World Cup 2024