Kohli MRF Sponsorship :టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరిగా ఖ్యాతి గడించాడు. ఇప్పటికే ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అతడు క్రికెట్ మైదానంలో దిగితే ఎంత దూకుడుగా ఉంటాడో, ఆటగాళ్లలో ఎంతగా ఉత్సాహం నింపుతాడో తెలిసిందే. ప్రత్యర్థులతో ఢీ అంటే ఢీ అంటాడు. బ్యాటుతోనే కాదు, మాటతోనూ సమాధానం ఇవ్వగల దిట్ట.
అందుకే విరాట్‌కు మైదానంలోనే కాకుండా బయట కూడా అతడు అంటే పడి చచ్చిపోయే వాళ్లు చాలామందే ఉన్నారు. అలానే అత్యధిక బ్రాండ్ విలువ కలిగిన భారత ప్రముఖుల జాబితాలోనూ కోహ్లీ టాప్‌లో కొనసాగుతున్నాడు. అతడితో ఒక్క ఎండార్స్మెంట్ చేస్తే చాలనుకునే ప్రముఖ కంపెనీలు చాలానే ఉన్నాయి. అయితే కోహ్లీ బ్యాట్ మీద గమనిస్తే ప్రముఖ టైర్ కంపెనీ MRF స్టిక్కర్ కనిపిస్తుంటుంది. ఎందుకంటే ఎమ్ఆర్ఎఫ్ కూడా విరాట్‌తో ఎండార్స్మెంట్ ఒప్పందం చేసుకుంది. మరి ఈ ఒప్పందం విలువ ఎంతో తెలుసా? ఏకంగా రూ.100 కోట్లు!
ఆరంభంలో ఇలా -2016లో విరాట్ కోహ్లీ MRFతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అప్పట్లో ఆ ఒప్పందం ఓ సంచలనం సృష్టించింది. కోహ్లీ బ్యాట్‌పై MRF స్టిక్కర్‌ను అంటించుకునేందుకు అతడికి దాదాపు రూ.8 కోట్లు చెల్లించింది ఎమ్మాఆర్ఎఫ్. అంటే విరాట్ క్రేజ్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎమ్ఎస్ ధోనీ వంటి దిగ్గజాలతో సహా ఇతర క్రికెటర్లు తమ బ్యాట్ స్పాన్సర్‌షిప్‌ల ద్వారా సంపాదిస్తున్న దాని కన్నా కోహ్లీ చేసుకున్న ఒప్పందం విలువ చాలా ఎక్కువ.