ETV Bharat / entertainment

'నేషనల్ క్రష్ ట్యాగ్​తో ​​టికెట్లు అమ్ముడుపోవు'- రష్మిక మంధన్నా - RASHMIKA MANDANNA

ట్యాగ్స్​పై రష్మిక రియాక్షన్- వాటితో టిక్కెట్లు తెగవు

Rashmika Mandanna
Rashmika Mandanna (Source : ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 14, 2025, 7:18 PM IST

Rashmika On National Crush Tag : యంగ్ హీరోయిన్ రష్మిక మంధన్నా ప్రస్తుతం కెరీర్​లో జెట్ స్పీడ్​తో దూసుకెళ్తున్నారు. ఆమె తాజాగా 'ఛావా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో మహారాణి యేసుబాయి పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. అయితే 'ఛావా' ప్రమోషన్స్​లో భాగంగా ఆమె రీసెంట్​గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఉన్న 'నేషనల్ క్రష్' ట్యాగ్ గురించి మాట్లాడారు. కేవలం ట్యాగ్‌ల వల్ల మాత్రమే సినిమా టికెట్లు అమ్ముడుపోవని అన్నారు. వీటి కంటే ప్రేక్షకుల ప్రేమాభిమానాలు తనకు ముఖ్యమని తెలిపారు.

'కెరీర్​లో ఎదగడానికి ట్యాగ్స్‌ ఉపయోగపడతాయంటే నేను నమ్మను. అలాంటివి ఫ్యాన్స్​ ప్రేమగా ఇస్తుంటారు. ఏది ఏమైనా అవి కేవలం ట్యాగ్స్‌ మాత్రమే. టికెట్ సేల్స్​పై వాటి ప్రభావమేమీ ఉండదు. మనం నటించే సినిమాలు, ప్రేక్షకుల ప్రేమాభిమానాలే టికెట్‌ సేల్స్‌పై ప్రభావం చూపిస్తాయి. అనుకోకుండా ఇండస్ట్రీలోకి వచ్చాను. 24 సినిమాల్లో నటించాను. నాకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుని, నా జర్నీని ఎంజాయ్ చేస్తున్నా' అని రష్మిక చెప్పారు.

ఇక సౌత్ ఇండస్ట్రీతోపాటు బాలీవుడ్​లోనూ రాణించడంపై రష్మిక మాచ్లాడారు. 'అన్ని ప్రాంతాల ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకోవడం ఆనందంగా ఉంది. అందుకు అనుగుణంగానే కష్టపడుతున్నా. కొన్నిసార్లు నిద్రకు టాటా చెప్పి మరీ, కెరీర్​పై ఎక్కువగా ఫోకస్‌ చేస్తున్నా' అని అన్నారు. కాగా, రష్మిక ఇప్పటికే 'యానిమల్'తో బాలీవుడ్​లో భారీ సక్సెస్​ ఖాతాలో వేసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.