తెలంగాణ

telangana

ETV Bharat / sports

'హార్దిక్​ లేకుండానే గుజరాత్​ స్ట్రాంగ్​గా ఉంది'- పాండ్యపై ఆసీస్​ మాజీ ప్లేయర్​ కీలక వ్యాఖ్యలు - Hardik Pandya ipl 2024

Hardik Pandya Gujart Titans IPL 2024 : ముంబయి ఇండియన్స్​ కెప్టెన్ హార్దిక్ పాండ్యపై ఆసీస్​ మాజీ ఆటగాడు బ్రాడ్​ హాగ్​ కీలక కామెంట్స్ చేశాడు. హార్దిక్ లేకుండానే గుజరాత్​ టైటాన్స్​ టీమ్ మరింత స్ట్రాంగ్​గా ఉందని తెలిపాడు. పాండ్య వెళ్లిపోవడం వల్ల గుజరాత్​కు పెద్ద నష్టమేమీ జరగలేదని చెప్పాడు. ఇంకా ఏమన్నాడంటే?

Hardik Pandya Gujart Titans IPL 2024
Hardik Pandya Gujart Titans IPL 2024

By ETV Bharat Telugu Team

Published : Mar 12, 2024, 8:58 AM IST

Updated : Mar 12, 2024, 9:49 AM IST

Hardik Pandya Gujart Titans IPL 2024 :టీమ్​ఇండియా స్టార్ బ్యాటర్, ముంబయి ఇండియన్స్​ ప్రస్తుతం కెప్టెన్ హార్దిక్​ పాండ్యపై కీలక వ్యాఖ్యలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్. హార్దిక్​ లేకుండానే గుజరాత్ జట్టు స్ట్రాంగ్​గా ఉందని అభిప్రాయపడ్డాడు. పాండ్య వెళ్లిపోవడం గుజరాత్​కు అంత పెద్ద నష్టం అని తాను అనుకోనని చెప్పాడు. అయితే మిడిల్​ ఆర్డర్​లో​ పాండ్య నాణ్యమైన ఆల్​రౌండర్​ అన్న బ్రాడ్​ హాగ్, కానీ గుజరాత్​ జట్టు దాన్ని కవర్​ చేయగలదని పేర్కొన్నాడు. వారికి మంచి బ్యాటింగ్​ లైన్​ కూడా ఉందని తెలిపాడు. అయితే ఇంతకుముందు హార్దిక్ టాప్​ ఆర్డర్​లో బ్యాటింగ్​ చేసేవాడని, కానీ అతడు ఆ స్థానంలో సరిపోడని బ్రాడ్​ అన్నాడు. కాబట్టి పాండ్య లేకుండానే గుజరాత్​ టైటాన్స్​ మెరుగ్గా ఉంది అని హాబ్​ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

హార్దిక్ పాండ్య కెప్టెన్సీలో గుజరాత్​ టైటాన్స్​ 2022 ఐపీఎల్ టైటిల్​ను సొంతం చేసుకుంది. 2023 సీజన్​లో ఫైనల్‌ వరకు దూసుకెళ్లి చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. అయితే, 2024 ఐపీఎక్​కు ముందు జరిగిన ట్రేడింగ్​లో హార్దిక్​ పాండ్య ముంబయి ఇండియన్స్‌ జట్టులోకి వచ్చాడు. అయితే​ జట్టులో పాండ్యకు సరైన ప్రత్యామ్నాయాన్ని గుజరాత్ వెతకడం లేదని ఆందోళన నెలకొన్న నేపథ్యంలో హాగ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. అయితే ప్రస్తుత ముంబయి జట్టులో హార్దిక్​ లోయర్ మిడిల్ ఆర్డర్​లో ఆడితే మంచిదని, పాండ్య అలాగే చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.

మరోవైపు క్రికెట్‌ అభిమానులను అలరించేందుకు ఈసారి ఐపీఎల్‌-2024 మెగా సమరం సిద్ధమవుతోంది. ఈనెల 22 నుంచి ఐపీఎల్​ 17వ సీజన్‌ ప్రారంభం కానుంది. టైటిల్​ గెలవడమే లక్ష్యంగా తమ తమ వ్యూహాలకు పదును పెడుతూ అన్ని జట్లు ఇప్పటికే ప్రాక్టీస్‌ను మొదలుపెట్టేశాయి. మార్చి 22న తొలి మ్యాచ్​లో డిఫెండింగ్​ ఛాంపియన్ సీఎస్​కేతో రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరు పోటీ పడనుంది. అయితే 2008లో ఐపీఎల్​ స్టార్ట్​ అయిన నాటి నుంచి ఆర్​సీబీ ఒక్కసారి కూడా టైటిల్​ అందుకోలేదు. అయితే ఈసారి ఎలాగైనా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కళ సాకారం చేసుకోవాలని బెంగళూరు జట్టు ఉవ్విళ్లూరుతోంది.

WPL 2024 : చావోరేవో మ్యాచ్​లో యూపీ ఓటమి- ప్లేఆఫ్​ ఆశలు గల్లంతే

ఐపీఎల్​ ఫీవర్​- ఆ 5 జట్ల సారథులైతే మారారు- మరి రిజల్ట్స్​ సంగతేంటి?

Last Updated : Mar 12, 2024, 9:49 AM IST

ABOUT THE AUTHOR

...view details