Gujarat Titans Sale:గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం సీవీసీ క్యాపిటల్ (CVC Capital) తమ ఫ్రాంచైజీ మెజారిటీ వాటాను వదులుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం అదానీ గ్రూపు, టోరెంట్ గ్రూపు వాణిజ్య సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు టాక్. చర్చలు సఫలమైతే సీవీసీ మెజారిటీ వాటాను విక్రయించనుంది.
2021లో ఫ్రాంచైజీ కొనుగోలు
2021లో రూ.5625 కోట్ల విలువైన గుజరాత్ టైటాన్స్ మెజారిటీ వాటాను సీవీసీ క్యాపిటల్ కొనుగోలు చేసింది. దీంతో సీవీసీ క్యాపిటల్ ఓనర్షిప్తోపాటు 4ఏళ్ల లాక్ ఇన్ పీరియడ్ (అగ్రిమెంట్)కూడా దక్కించుకుంది. అయితే ఈ లాక్ ఇన్ పీరియడ్లో ఓనర్ ఫ్రాంచైజీని ఇతరులకు అమ్మలేడు. ఇతరులు ఫ్రాంచైజీని కొనలేరు. ఈ విధంగా బీసీసీఐ ఫ్రాంచైజీ ఓనర్లకు షరతులు విధించింది.
ముగుస్తున్న లాక్ ఇన్ పీరియడ్
అయితే గుజరాత్ ఫ్రాంచైజీ నాలుగేళ్ల లాక్- ఇన్ పీరియడ్ 2025 ఫిబ్రవరిలో ముగుస్తుంది. దీంతో సీవీసీ క్యాపిటల్ పార్టనర్ ఫ్రాంచైజీ యాజమాన్యం నుంచి ఎగ్జిట్ అయ్యే ఆలోచనలో ఉంది. ఈ మేరకు అదానీ, టొరెంటో గ్రూపు సంస్థలతో చర్చలు జరుపుతుంది. అయితే అదానీ, టొరెంట్ గ్రూపు రెండూ గుజరాత్ ఫ్రాంచైజీపై గతంలోనే ఆసక్తి చూపాయి. వరుసగా రూ.5,100 కోట్లు, రూ.4,653 కోట్లకు వేలం వేశాయి.