తెలంగాణ

telangana

ETV Bharat / sports

నీరజ్​కు రూ.5కోట్లు, సింధుకు రూ.3కోట్లు- ఏ అథ్లెట్​కు ఎంత ఖర్చైందో తెలుసా? - Paris Olympics 2024 - PARIS OLYMPICS 2024

Paris Olympics 2024: పారిస్‌ ఒలింపిక్స్‌లో పతకాలు సాధించే అవకాశం ఉన్న అథ్లెట్లపై భారత్‌ భారీగానే ఖర్చు చేసింది. ట్రైనింగ్‌ కోసం ఒక్కో అథ్లెట్‌కి ఎంత నిధులు కేటాయించిందో తెలుసా?

Paris Olympics 2024
Paris Olympics 2024 (Source: Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Jul 22, 2024, 3:22 PM IST

Paris Olympics 2024:ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా సంబరం ఒలింపిక్స్‌. ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న ఈ క్రీడల్లో పతకం సాధించే లక్ష్యంతో ఆయా దేశాలు తమ క్రీడాకారులను సిద్ధం చేస్తుంటాయి. ఈసారి పారిస్‌ ఒలింపిక్స్‌లో పాల్గొనే టాప్‌ అథ్లెట్ల కోసం భారతదేశం భారీగానే ఖర్చు చేసింది. ప్రస్తుత ఒలింపిక్ సైకిల్ (2021-2024)లో ఆయా క్రీడలకు భారత్ దాదాపు రూ.470 కోట్లు ఖర్చు చేసింది. ఈ విశ్వ క్రీడల్లో భారత్ నుంచి 117 మంది అథ్లెట్లు ఆయా ఈవెంట్లలో తలపడనున్నారు. వాళ్ల ప్రదర్శన చూసేందుకు యావత్ దేశం ఎదురు చూస్తోంది. అయితే ఈ ఒలింపిక్స్‌లో భారత ప్రభుత్వం ఎవరిపై ఎంత ఖర్చు పెట్టింది? ఇప్పుడు తెలుసుకుందాం.

అగ్రశ్రేణి క్రీడాకారుల శిక్షణకు ఎంత ఖర్చు?

  • నీరజ్ చోప్రా:ప్రపంచ ఛాంపియన్ స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా, పాటియాలా యూరప్‌లో శిక్షణ కోసం రూ.5.72 కోట్లు అందుకున్నాడు. 2022 ఆసియా క్రీడలు, దోహా డైమండ్ లీగ్‌లో స్వర్ణం గెలిచిన నీరజ్ టాప్ ఫామ్‌లో ఉన్నాడు.
  • సాత్విక్‌సాయిరాజ్‌ రాంకిరెడ్డి- చిరాగ్‌ శెట్టి: హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఈ బ్యాడ్మింటన్‌ ఆటగాళ్లకు ఒక్కొక్కరికి రూ.5.62 కోట్లు వచ్చాయి. పతకాలు సాధిస్తారని భారీ అంచనాలు ఉన్నాయి.
  • పీవీ సింధు:రియోలో రజతం, టోక్యోలో కాంస్యం సాధించి, ఇప్పుడు స్వర్ణంపై గురిపెట్టిన సింధు బెంగళూరులోని ప్రకాశ్ పదుకొనే బ్యాడ్మింటన్ అకాడమీలో రూ.3.13 కోట్ల పెట్టుబడితో శిక్షణ తీసుకుంటోంది.
  • ఎస్ మీరాబాయి చాను:టోక్యోలో రజత పతకంతో చరిత్ర సృష్టించిన వెయిట్‌లిఫ్టర్. ఇప్పుడు SAI NSNIS పాటియాలాలో శిక్షణ కోసం రూ.2.74 కోట్లు అందుకుంది.
  • షూటింగ్ స్టార్స్: అనీష్ భన్వాలా (రూ.2.41 కోట్లు), మను భాకర్ (రూ.1.68 కోట్లు), సిఫ్ట్ కౌర్ సమ్రా (రూ.1.63 కోట్లు), ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ (రూ.1.56 కోట్లు), ఇలవెనిల్ వలరివన్ (రూ.1.32 కోట్లు) అందుకున్నారు. వీరిలో ఎక్కువ మంది న్యూఢిల్లీలోని SAI డాక్టర్ కర్ణి సింగ్ షూటింగ్ రేంజ్‌లో శిక్షణ పొందుతున్నారు.
  • రోహన్ బోపన్న: ప్రముఖ టెన్నిస్‌ స్టార్‌ బోపన్న బెంగళూరులో శిక్షణ పొందుతున్నాడు. శిక్షణకు రూ.1.56 కోట్లు అందుకున్నాడు.
  • మనికా బాత్రా: టేబుల్ టెన్నిస్‌లో ITTF టాప్ 25లో ర్యాంక్ పొందిన మొదటి భారతీయ మహిళ మనిక బాత్రా, శిక్షణకు రూ.1.30 కోట్లు అందుకుంది. ముంబయిలోని ఒక ప్రైవేట్ అకాడమీ, హైదరాబాద్‌లోని AVSC టేబుల్ టెన్నిస్ అకాడమీలో శిక్షణ పొందుతోంది.
  • ధీరజ్ బొమ్మదేవర: ఆర్చర్ పారిస్ కోటాను పొంది రూ.1.07 కోట్ల పెట్టుబడితో సోనెపట్‌లో శిక్షణ పొందుతున్నాడు.
శరత్ కమల్ టేబుల్ టెన్నిస్ రూ.1.14 కోట్లు
ధీరజ్ బొమ్మదేవర ఆర్చరీ రూ.1.07 కోట్లు
విష్ణు శరవణన్ సెయిలింగ్ రూ.99.33 లక్షలు
నిఖత్ జరీన్ బాక్సింగ్ రూ.91.71 లక్షలు
లోవ్లినా బోర్గోహైన్ బాక్సింగ్ రూ.81.76 లక్షలు
వినేష్ ఫోగట్ రెజ్లింగ్ రూ.70.45 లక్షలు
యాంటీమ్ పంఘల్ రెజ్లింగ్ రూ.66.55 లక్షలు
అమిత్ పంఘల్ బాక్సింగ్ రూ.65.90 లక్షలు
నిశాంత్ దేవ్ బాక్సింగ్ రూ.65.86 లక్షలు
అదితి అశోక్ గోల్ఫ్ రూ.63.21 లక్షలు
అమన్ సెహ్రావత్ రెజ్లింగ్ రూ.56.50 లక్షలు
దీపికా కుమారి ఆర్చరీ రూ.39.92 లక్షలు
రీతికా హుడా రెజ్లింగ్ రూ.38.05 లక్షలు
శుభంకర్ శర్మ గోల్ఫ్ రూ.37 లక్షలు
ధింధీ దేశింఘు స్విమ్మింగ్‌ రూ.10.87 లక్షలు

ABOUT THE AUTHOR

...view details