ETV Bharat / sports

ఆ ఫుట్​బాల్​ క్లబ్​కు రూ.10 కోట్ల వార్షిక ఆదాయం​! - అంత మొత్తం సంపాందించిన తొలి టీమ్​ కూడా అదే! - REAL MADRID ANNUAL REVENUE

రియల్ మాడ్రిడ్ నయా రికార్డు - ఎక్కువ వార్షిక ఆదాయాన్ని ఆర్జించిన మొదటి ఫుట్‌బాల్ క్లబ్‌గా చరిత్రలోకి

Real Madrid Annual Revenue
REAL MADRID (Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Jan 30, 2025, 4:35 PM IST

Real Madrid Annual Revenue : ఫుట్​బాల్ జట్టు రియల్ మాడ్రిడ్ రికార్డు సృష్టించింది. సుమారు బిలియన్ యూరో (1.04 బిలియన్ డాలర్లు) కంటే ఎక్కువ వార్షిక ఆదాయాన్ని నమోదు చేసిన మొదటి సాకర్ క్లబ్​గా అవతరించింది. టాప్ 20 క్లబ్​లు తొమ్మిది శాతం ఆదాయాన్ని పెంచుకున్నాయని డెలాయిట్ ఫుట్​బాల్ మనీ లీగ్ వెల్లడించింది.

2023-2024 సీజన్​లో స్పానిష్ లీగ్(లాలిగా) టైటిల్​ను రియల్ మాడ్రిస్ కైవసం చేసుకుంది. అలాగే 2023-24 సీజన్​లో ఛాంపియన్స్ లీగ్ ట్రోఫీని కూడా దక్కించుకుంది. శాంటియాగో బెర్నాబ్యూ స్టేడియంలో రియల్ మాడ్రిడ్ మ్యాచ్‌ డే ఆదాయంలో భారీగా పెరుగుదల కనిపించింది.

తొలి ఐదు స్థానాల్లో ఇవే
కాగా, ఆదాయంలో రియల్ మాడ్రిడ్ అగ్రస్థానంలో ఉండగా, మాంచెస్టర్ సిటీ 708 మిలియన్ యూరోల (88.06 మిలియన్ డాలర్లు) ఆదాయంతో రెండో స్థానంలో నిలిచింది. మాంచెస్టర్ సిటీ వరుసగా నాలుగోసారి ప్రీమియర్ లీగ్ టైటిల్, యూరోపియన్ సూపర్ కప్, క్లబ్ వరల్డ్ కప్​ను గెలుచుకుంది. పారిస్ సెయింట్ జర్మైన్, మాంచెస్టర్ యునైటెడ్, బేయర్న్ మ్యూనిచ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

లాస్ బ్లాంకోస్ మ్యాచ్‌ డే ఆదాయం 210 మిలియన్ యూరోలు (26.12 మిలియన్ డాలర్లు). బార్సిలోనా మ్యాచ్‌ డే ఆదాయంలో అనూహ్య తగ్గుదల కనిపించింది. ప్రీమియర్ లీగ్ జట్లు వార్షిక ఆదాయ జాబితాలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. బార్సిలోనా, ఆర్సెనల్, లివర్‌ పూల్, టోటెన్‌ హామ్ హాట్ స్పర్, చెల్సియా కూడా టాప్-10లో చోటు దక్కించుకున్నాయి. కాగా, కమర్షియల్ ఆదాయం క్లబ్​లకు అతిపెద్ద ఆదాయ వనరుగా ఉంది. అయితే అన్ని క్లబ్​లకు కలిపి బ్రాడ్ కాస్టింగ్ రెవెన్యూ 3.64 బిలియన్ యూరోలు.

"టాప్- 10 మనీ లీగ్ క్లబ్​ల ఇన్​కమ్​పై వాణిజ్య ఆదాయం ఆధిపత్యం చెలాయించింది. అయితే కొన్ని జట్లకు బ్రాడ్ కాస్టింగ్ ఆదాయం కీలకంగా ఉంది. భవిష్యత్తులో పోటీ మరింత పెరుగుతుంది. మరిన్ని ప్రసార, మ్యాచ్‌ డే ఆదాయాలు వస్తాయి. ఇవి ఫుట్​బాల్​ క్లబ్​లకు సంపాదన సామర్థ్యాన్ని మరింత పెంచుతాయి." అని డెలాయిట్ స్పోర్ట్స్ బిజినెస్ గ్రూప్‌ ప్రధాన భాగస్వామి టిమ్ బ్రిడ్జ్ తెలిపారు.

ఆదాయంలో టాప్-10లో ఉన్న ఫుట్​బాల్ జట్లు ఇవే!

రియల్ మాడ్రిడ్(1,045.5 మిలియన్ యూరోలు)

మాంచెస్టర్ సిటీ(837.8 మిలియన్ యూరోలు)

పారిస్ సెయింట్ జర్మైన్(805.9 మిలియన్ యూరోలు)

మాంచెస్టర్ యునైటెడ్ (770.6 మిలియన్ యూరోలు)

బేయర్న్ మ్యూనిచ్(765.4 మిలియన్ యూరోలు)

బార్సిలోనా(760.3 మిలియన్ యూరోలు)

ఆర్సెనల్ (716.5 మిలియన్ యూరోలు)

లివర్‌ పూల్(714.7 మిలియన్ యూరోలు)

టోటెన్‌ హామ్ హాట్స్‌ పర్(615.0 మిలియన్ యూరోలు)

చెల్సియా(545.5 మిలియన్ యూరోలు)

వారం పాటు కేరళలో మెస్సీ - ఫ్రెండ్లీ మ్యాచ్​లతో పాటు ఫ్యాన్ మీట్స్​ కూడా!

26గంటలు, 825 గోల్స్‌- ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ రికార్డు- గిన్నిస్​ బుక్​లోనూ చోటు - World Longest Football Match

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.