తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీమ్‌ఇండియా పేలవ ప్రదర్శన- ప్లేయర్లే కాదు, గంభీర్ ప్లేస్​కు కూడా నో గ్యారెంటీ! - GAUTAM GAMBHIR HEAD COACH

గంభీర్ విషయంలో బీసీసీఐ సీరియస్- పరిస్థితులు మారకపోతే వేటు తప్పదు!

Gautam Gambhir
Gautam Gambhir (Source : Associated Press)

By ETV Bharat Sports Team

Published : Jan 1, 2025, 8:03 PM IST

Gautam Gambhir Head coach :టీమ్ఇండియా హెడ్ కోచ్​గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత టెస్టుల్లో జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. ఇటీవల స్వదేశంలో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో న్యూజిలాండ్‌ చేతిలో వైట్‌వాష్‌కు గురైన భారత జట్టు, ఆస్ట్రేలియాలో పర్యటనలోనూ తడబడుతోంది. తొలి టెస్టులో విజయం సాధించినప్పటికీ, అదే జోష్​ ఆ తర్వాత మ్యాచ్​ల్లో కొనసాగించలేకపోతోంది. ముఖ్యంగా బ్యాటింగ్ విభాగం ఘోరంగా విఫలమవుతూ వస్తోంది. దీనిపై బీసీసీఐ సీరియస్​గా ఉన్నట్లు తెలుస్తోంది. మున్ముందు ప్రదర్శన మెరుగవకపోతే ప్లేయర్లతోపాటు కోచ్​పైనా వేటు వడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

'ఆస్ట్రేలియాతో ఇంకా ఓ టెస్టు మ్యాచ్ ఆడాలి. ఆ తర్వాచ ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది. జట్టు ప్రదర్శన మెరుగుపడకపోతే కోచ్‌ గౌతమ్ గంభీర్ స్థానం కూడా సురక్షితం కాదు. గంభీర్‌ ఎప్పుడూ బీసీసీఐ ఫస్ట్ ఛాయిస్‌ కోచ్‌ కాదు (అది వీవీఎస్‌ లక్ష్మణ్). అయితే కొంతమంది విదేశీ మాజీ స్టార్ ఆటగాళ్లు మూడు ఫార్మాట్లలో భారత్‌కు కోచ్‌గా ఉండటానికి ఇష్టపడలేదు. అందుకే గంభీర్‌ విషయంలో బీసీసీఐ రాజీ పడింది. దీంతోపాటు మరి కొన్ని అంశాలు కూడా దీనికి కారణమయ్యాయి' అని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు.

పంత్​పై వేటు?
భారత్- ఆసీస్ సిరీస్​లో యంగ్ బ్యాటర్ రిషభ్ పంత్ అంచనాలు అందుకోలేకపోతున్నాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు అతడి నుంచి భారీ ఇన్నింగ్స్​ రాలేదు. పంత్ ఈ సిరీస్​లో వరుసగా 37, 1, 21, 28, 9, 28, 30 స్కోర్లు నమోదు చేశాడు. దీంతో చివరి టెస్టుకు పంత్​ను జట్టులోంచి తప్పించాలని మేనేజ్​మెంట్ భావిస్తోందట. పంత్ స్థానంలో మరో వికెట్‌కీపర్ ధ్రువ్‌ జురెల్​ను జట్టులోకి తీసుకోవాలని ఆలోచిస్తుందట.

మరోవైపు ఆఖరి మ్యాచ్​ టీమ్ఇండియాకు అత్యంత కీలకం. ఐదో టెస్టు నెగ్గినతేనే 2-2తో సిరీస్ సమం అవుతుంది. అలాగే డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు కూడా సజీవంగా ఉంటాయి. ఈ క్రమంలోనే మేనేజ్మెంట్ కఠిన నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. అయితే పెర్త్‌లో ఆసీస్‌తో జరిగిన తొలి టెస్టుకు రోహిత్‌ అందుబాటులో లేకపోవడంతో జురెల్‌కు తుది జట్టులో దక్కింది. కానీ, అతను నిరాశపర్చాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 12 పరుగులే చేశాడు.

గంభీర్ కామెంట్స్​కు పాంటింగ్ రిప్లై- అతడి బాధ అది కాదంట!

రోహిత్ గురించి ఇప్పుడే ఏం చెప్పలేం- హిట్​మ్యాన్ లేకపోతే కెప్టెన్ అతడే!

ABOUT THE AUTHOR

...view details