తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఫిడే క్యాండిడేట్స్​ విజేతగా గుకేశ్- భారత గ్రాండ్​మాస్టర్ ప్రపంచ రికార్డ్ - fide candidates 2024 - FIDE CANDIDATES 2024

Fide Candidates 2024: భారత గ్రాండ్​మాస్టర్ గుకేశ్ సంచలనం సృష్టించాడు. 17 ఏళ్ల వయసులో ప్రపంచ ఛాంపియన్‌ టైటిల్‌ దక్కించుకున్న అతి పిన్న వయస్కుడిగా గుకేశ్‌ రికార్డు కొట్టాడు.

Fide Candidates 2024
Fide Candidates 2024

By ETV Bharat Telugu Team

Published : Apr 22, 2024, 7:16 AM IST

Updated : Apr 22, 2024, 9:26 AM IST

Fide Candidates 2024:భారత గ్రాండ్​మాస్టర్ గుకేశ్ దొమ్మరాజు సంచలనం సృష్టించాడు. ​తాజాగా కెనడా వేదికగా జరిగిన ఫిడే క్యాండిడేట్స్ చెస్​ టోర్నమెంట్​లో 17 ఏళ్ల గుకేశ్​ తన ప్రత్యర్థి హికారు నకముర (అమెరికన్)పై విజయం సాధించాడు. ఈ క్రమంలో అతి పిన్న వయసులో ఫిడే క్యాంటిడేట్స్​ టైటిల్ సొంతం చేసుకున్న ప్లేయర్​గా రికార్డు కొట్టాడు. 13వ రౌండ్​ వరకు 8.5 పాయింట్లతో నిలిచిన గుకేశ్, 14వ రౌండ్​లో నకమురతో గేమ్ డ్రా చేసుకున్నాడు. దీంతో అతడి ఖాతాలో 9 పాయింట్లు చేరాయి. మరోవైపు నెపోమ్నిషియా (రష్యా)- ఫాబియానో కరువానా (అమెరికా) మధ్య గేమ్ కూడా డ్రా అయ్యింది. వారిద్దరూ 8.5 పాయింట్ల వద్దే ఆగిపోయారు.

దీంతో 9 పాయింట్లతో లీడ్​లో ఉన్న భారత యంగ్ ప్లేయర్ గుకేశ్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. ఇక చెస్ లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్ తర్వాత క్యాండిడేట్స్ విజేతగా నిలిచిన రెండో భారతీయుడిగానూ గుకేశ్ రికార్డు సాధించాడు. ఈ విజయంతో గుకేశ్ చైనా గ్రాండ్‌మాస్టర్‌ డింగ్‌ లిరెన్‌తో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ పోరుకు అర్హత సాధించాడు. ఆ పోటీలోనూ గుకేశ్ విజయం సాధిస్తే అతి పిన్న వయస్సులో ఛాంపియన్‌గా నిలిచిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించే ఛాన్స్​ ఉంది. గతంలో మాగ్నస్ కార్ల్‌సన్, కాస్పరోవ్‌ 22 ఏళ్ల వయసులో ఛాంపియన్లుగా నిలిచారు. కాగా, ఈ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పోటీలకు తేదీలు, వేదిక ఇంకా ఖరారు కాలేదు.

Last Updated : Apr 22, 2024, 9:26 AM IST

ABOUT THE AUTHOR

...view details